పోలీస్ ట్రైనింగ్‌లో చరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘్ధృవ’. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ ఇందులో పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపిస్తాడు. ఇందుకోసం చరణ్ ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిసింది. గుర్రపుస్వామి, సైక్లింగ్ కోసం ఎక్కువగా టైమ్ కేటాయిస్తున్నాడు. దాంతోపాటు బరువు తగ్గడానికి కూడా ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సి వుంది. ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాడట. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కాశ్మీర్‌లో చిత్రీకరిస్తారట. దసరా కానుకగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.