దర్శకుడైన తన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎం 6 చిత్రం ద్వారా నిర్మాతగా పరిశ్రమకు పరిచమైన విశ్వనాధ్ తన్నీర్ దర్శకుడిగా మారుతున్నారు. విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- దర్శకుడిగా మారాలనే కోరిక ఎప్పటి నుంచో వుందని, ఆ క్రమంలో అనేక కథలు వినగా, ఓ మంచి కథ దొరకడంతో దర్శకుడిగా మారానని తెలిపారు. కంటెంట్ ప్రధానంగా రూపొందించే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ముఖ్యంగా సమాజానికి ఓ సందేశం ఇస్తూ క్లైమాక్స్ హైలెట్‌గా సాగే మూవీ అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో ధ్రువను కథానాయకుడిగా ఎంపిక చేశామని, ఫిబ్రవరి నెలలో హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరిస్తామని, మొత్తం నాలుగు షెడ్యూల్స్ వుంటాయని ఆయన అన్నారు. రాగిణి, డి.ఎస్.రావు, గురురాజ్, నామాల రవీంద్ర సూరి, సందీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నది.