వైనాట్ నుంచి త్వరలో మ్యూజిక్ కేటలాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిం ప్రొడక్షన్ స్టూడియోగా పదేళ్ల క్రితం ప్రారంభమైన వైనాట్ స్టూడియో అంచెలంచెలుగా ఎదుగుతుందని సంస్థ ప్రొడ్యూసర్ ఎస్.శశికాంత్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 18 ఫీచర్ ఫిలింస్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందించిందీ సంస్థ. ఎఆర్ రెహమాన్, రాజ్‌కుమార్ హీరాణి, ఆనంద్ ఎల్.రాయ్ వంటి కళాకారులతో ఉత్తమ చిత్రాలు నిర్మించామని, భారతదేశపు తొలి పూర్తి స్థాయి స్ఫూఫ్ ఫిలింగ్‌గా, శివ హీరోగా తమిళంలో రూపొందించామన్నారు. మూసకు భిన్నంగా ఆసక్తికరమైన వినోదాత్మక చిత్రాలను అందించే ఉద్దేశ్యంతోనే తమ సంస్థ పనిచేస్తుందని, అన్ని భాషల్లో సినిమాలు రూపొందించి పంపిణీ చేయడానికి భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. వైనాట్ మ్యూజిక్ అనే లేబుల్‌తో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన తాము సమీప భవిష్యత్తులో ఉత్తమమైన కేటలాగ్‌ను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ తరుణంలో ఓ ఉత్తేజకరమైన సినిమాను రూపొందించే సన్నాహాలు జరుపుతున్నామని, కొత్త కానె్సప్ట్‌ల రూపకల్పనకు అందరి సహకారం ఆశిస్తున్నామన్నారు. ఈ సంస్థ ప్రస్తుతం డి 40, మండేలా, ఏలె వంటి చిత్రాలను అందిస్తుందని తెలిపారు.