సీఎం పీఏ హీరో అయితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్ బ్యాక్ అవుతాడనుకున్న అంచనాల్ని -డిస్కోరాజాతో మళ్లీ తలకిందులు చేశాడు రవితేజ. ఏ కథనైనా తన స్టామినాతో రవితేజ హిట్ చేయగలడన్నది ఒకప్పటి మాట. రవితేజకు హిట్టుపడాలంటే ఎలాంటి కథ తేవాలన్నది ఇప్పటి మాట. అయితే, డిస్కోరాజా నిరాశపర్చినా -క్రాక్ చిత్రంతో మళ్లీ ఆశలు రేపుతున్నాడు రవితేజ. ఇంటెన్స్ లుక్‌లో వున్న పోలీస్ గెటప్‌తో ఇటీవలే ఫస్ట్‌లుక్ ఇచ్చి -తన బాడీలాంగ్వేజ్‌కు సూటయ్యే కథతో వస్తున్నానన్న ఇండికేషన్స్ ఇప్పటికే ఇచ్చేశాడు. అలా గోపీచంద్ మలినేనితో క్రాక్ చిత్రం చేస్తూనే -తరువాతి ప్రాజెక్టుకు డైరెక్టర్ రమేష్ వర్మను లైన్లో పెట్టినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ సమ్మర్‌లోనే రమేష్ వర్మతో ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లొచ్చన్న మాట వినిపిస్తోంది. గతంలో ఇదే దర్శకుడితో రవితేజ చేసిన వీర చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే, గతేడాదికి ‘రాక్షసుడు’ రీమేక్‌తో సూపర్‌హిట్ అందుకున్న నేపథ్యంలో -మరోసారి రమేష్‌వర్మకు ప్రాజెక్టు ఇచ్చినట్టు కనిపిస్తోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైం కంటెంట్‌తో కథ ఉండబోతోందన్నది లేటెస్ట్ టాక్. ఒక సీఎం పీఏ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాడు? ఎలాంటి కరెప్షన్‌కు పాల్పడగలడు.. అంతటి శక్తియుక్తలున్న పీఏ పరివర్తనకు గురైతే ఎలాంటి ఘనకార్యాలు సాధించగలడన్న కోణంలో కథ ఉంటుదన్నది టాక్. కెరీర్ ఒడిదుడుకుల్లో నడుస్తున్నా -ప్రయోగాత్మక కథలతో ముందుకెళ్లడంలో రవితేజ వెనుకడుగు వేయడం లేదన్నది పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. టైమెప్పుడూ ఒకవైపే ఒకేలా ఉండదు కనుక -రవితేజ ఫ్యూచర్ ప్రాజెక్టులు పూర్వవైభవాన్ని తీసుకొస్తాయేమో చూడాలి.