మంచు లక్ష్మి బాస్మతి బ్లూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఇప్పటికే లాస్‌వేగాస్, ఇ.ఆర్., డెస్పరేట్ హౌస్‌వైఫ్ లాంటి టెలివిజన్ సీరియల్స్‌తోపాటు హాలీవుడ్ సినిమాల్లో నటించింది. మళ్లీ చాలాకాలం తరువాత హాలీవుడ్ నిర్మాణ సంస్థలో నటిస్తున్న చిత్రం ‘బాస్మతి బ్లూస్’. ఈ చిత్రం ఎక్కువ భాగం ఇండియాలోనే జరిగిందని, ఇటీవలే అమెరికా వెళ్లి ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసిందని అన్నారు. బ్రీలార్సన్, డోనాల్డ్ సదర్‌లాండ్, స్కాట్ బకు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డాన్ బరోన్ దర్శకత్వం వహించారు. మెనీక్యూ కాల్‌ఫీల్డ్ నిర్మించిన ఈ చిత్రం ఒక సైంటిస్టు తాను సృష్టించిన కొత్త వరి వంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియావచ్చిన శాస్తవ్రేత్తకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని, అతని జీవితం, ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో తెరకెక్కిందని, ఈ చిత్రాన్ని ఎ.ఎమ్.బి.ఐ. సంస్థ విడుదల హక్కులను భారీ రేటుకి దక్కించుకుందని అన్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.