Others

మనోజ్ఞుడు మందపాడు రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా వారు వీరు అనే తేడా ల్లేకుండా చూసినా రామ అనని వారుండరు . అలాంటి రామ అనే శబ్దానికి నిలువెత్తు రూపం ధరించి దశరథునికి పెద్ద కొడుకుగా నలుగురన్నదమ్ముల మధ్య రాముడు కౌసల్యా తనయుడై పుట్టాడు. కాలక్రమంలో రాముడు మా దేవుడు అనే వారు కలియుగంలో వచ్చారు. త్రేతాయుగాన రాముడు దేవుడు అనే వారున్నా ఈ కలియుగంలో రాముడిని రాజారాముడుగా కాకుండా అందరి దేమునిగా ధర్మ పరిరక్షక రాముడుగా కీర్తిస్తున్నవారు, గుడికట్టించి కొలిచేవారు ఎక్కువే. అలాంటి కోదండ రాముడు మందపాడు రాముడై ఆ ఊరందరి సఖుడు.. ఉర్వినేరు శరధరుడుగా కీర్తినందుకుంటున్నాడు.
గుంటూరు జిల్లా మాచెర్లకు సమీపంలోని మందపాడు అనే గ్రామం ఉంది. కొన్నాళ్లక్రితం వరకు ఇక్కడ రాజుల రాజ్యకాంక్షకు ప్రజ్వరిల్లిన పౌరుషాలు, యుద్ధనీతి పేరిట పెట్రేగిన కుళ్ళు కుతంత్రాలతో అట్టుడికిపోయన నేలగా చరిత్రలో లిఖితమైంది. ఆ కాలంలోనే శివకేశవుల వైరుధ్యభావాలు ఎగిసి మానవజాతికే పెనుముప్పు తెచ్చిన స్థలంగా కూడా పేరు పడింది ఈ మందపాల. కానీ దాదాపు నూట అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠితమైన శ్రీరామచంద్రుని ఆలయం భక్తజనులకు అమూల్య మైన తీర్థరాజంగా కొనియాడ బడుతోంది.
ఈ ఆలయంలో శ్రీరామ నవమినాడు సీతారాముల కల్యాణంతో పాటు శివపార్వతుల కల్యాణ వేడుకలను కూడా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. శివ కేశవుల అభేదత్వానికి, మైత్రీ బంధానికి మందపాడు గ్రామమే ఆదర్శం,ఆ రామాలయమే ప్రతీక.
కొన్నాళ్లక్రితం మందపాడులో తాహసిల్ దారుగా ఉన్న మందపాటి సుబ్బయ్యకు శ్రీరామచంద్రుల వారు కలలో కనిపించి, పొరుగు గ్రామం శిరిపురము చెరువు గట్టున తాము ఉన్నామని, తమను మందపాడుకు తీసుకువెళ్లాల్సిందిగా చెప్పారట. ఆ తరువాత కొన్నాళ్లకు శిరిపురపు చెరువు గట్టు వద్ద తవ్వినప్పుడు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల విగ్రహాలు అక్కడ లభించినాయి. అయితే వాటిని శిరిపురం గ్రామస్థులు తామ ఊరిలోనే ప్రతిష్ఠిస్తామనడంతో, ప్రత్యేకంగా మరో విగ్రహాలు విశిష్టంగా చేయించి మందపాడులో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అదే ఊరిలో శిథిల శివాలయాన్ని కూడా ఈ రామచంద్రుని ఆలయంలోకే తరలించి శివాలయ ప్రతిష్ఠ కూడా చేసి శివకేశవ ఆలయ సముదాయంగా దీన్ని తీర్చిదిద్దారు. ఆలయ నిర్వహణకు అవసరమైన మడిమాన్యాలను కూడా ఏర్పాటు చేయడానికి మందపాటి సుబ్బయ్య ముందుకువచ్చి తన సొంత భూమి 60 ఎకరాలు స్వామికి సమర్పించగా, ఆ తరువాత గ్రామస్థుల దానంతో అది వంద ఎకరాలు అయింది. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీరామ నవమి, శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మందపాడుకు చుట్టుపక్కలనున్న గ్రామాల ప్రజలకు సైతం మందపాడు రాముడే ఇలవేలుపు. ఆలయంలోని మూల విరాట్టు అద్భుతంగా ఉంటారు. నూనూగు మీసాలతో పదహారేళ్ల బాలరాముడిలా ఆయన విగ్రహం ప్రకాశిస్తుంటుంది. స్వామి వారి దర్శనమాత్రం చేతనే సమస్త కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఈ గ్రామాల ప్రజలు తమ సుఖ దుఃఖాలను రాముడితో పంచుకుంటారు. వారి పంటలలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా రాముల వారికి సమర్పించుకుంటారు. స్వామివారికి చేసే అనేక సేవల్లో రథోత్సవం ప్రధానమైంది. తిరుపతి తరువాత రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్న అతి పెద్ద రథాల్లో మందపాడు రథం రెండవదని ప్రసిద్ధి. అరవై ఏళ్ల నాటి రథం ఈ నాటికి శ్రీరాముల వారికి తన సేవలను అందిస్తోందని ఇదంతా శ్రీరాముని దయనే అని అంటారు అక్కడి రామభక్తులు.

- జి. వెంకట్రావు 8885622196