లారెన్స్‌తో నయన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య క్రేజీ భామ నయనతార మంచి జోరుమీదుంది. ఇప్పటికే వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తూ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్న నయనతార, మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నయనతార కోసం స్టార్ హీరోలు క్యూలో ఉన్నా కూడా కథకు ప్రాధాన్యత ఇస్తూ చిన్న హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్న ఈమె తాజాగా లారెన్స్ సరసన నటించేందుకు ఓకె చెప్పింది. లారెన్స్ ప్రస్తుతం తమిళంలో తెలుగు పటాస్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ద్విపాత్రాభినయంలో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తికావచ్చిన ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించేందుకు నయనతార ఓకె చెప్పిందని అంటున్నారు. కథ బాగా నచ్చడంతోనే ఈ సినిమాకు ఓకె చెప్పినట్లు సమాచారం. మరోవైపు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణలాంటి హీరోలు నయనతార కోసం ప్రయత్నాలు చేస్తుంటే, ఆమె ఇలా కొత్త, చిన్న హీరోల సరసన సినిమాలు ఒప్పుకుని అందరికీ షాక్ ఇస్తోంది.