మెగా జోడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి ప్రముఖ నటుడు చిరంజీవి తన 150వ చిత్రాన్ని మొదలుపెట్టాడు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం గత నెల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల చివరివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ లిస్టులోకి నయనతార, అనుష్క పేర్లు విన్పిస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి చేరింది మరో గ్లామర్ భామ రెజీనా కసాండ్ర. ఇప్పటికే మెగా హీరోలతో జోడీ కట్టిన ఈ భామ చిరు సరసన నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తోందట. ఒకవేళ ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకపోయినా కనీసం ఐటెం సాంగ్ చేసేందుకైనా సిద్ధమంటోందట. మొత్తానికి మెగా ఛాన్స్ కొట్టేయాలని ప్లాన్‌లో వుంది రెజీనా!