జక్కన్న ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్రం టాకీ పూర్తిచేసుకుని త్వరలోనే విదేశాల్లో మూడు పాటల చిత్రీకరణ జరుపుకోనున్న సందర్భంగా నిర్మాత సుదర్శన్‌రెడ్డి వివరాలు తెలియజేస్తూ, సునీల్ నటించే ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని, దాంతోపాటు మంచి ప్రేమకథతో సాగుతుందని, ముఖ్యంగా సునీల్ నటన చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు. టైటిల్‌కు తగ్గట్టుగా సునీల్ ఆకట్టుకుంటాడని, ఈనెల 11నుంచి విదేశాల్లో మూడు పాటల్ని చిత్రీకరిస్తామని, ఆ తరువాత మరో రెండు పాటలను వైజాగ్‌లో చిత్రీకరించి, మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:సి.రాంప్రసాద్, సంగీతం:దినేష్, ఆర్ట్:మురళి, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, సహ నిర్మాతలు:ఆయుష్‌రెడ్డి, అక్షిత్‌రెడ్డి, నిర్మాత: సుదర్శన్ రెడ్డి, దర్శకత్వం:వంశీకృష్ణ ఆకెళ్ల.