శర్వానంద్‌కు జోడీగా లావణ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న హీరో శర్వానంద్‌తో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘్ఛత్రపతి’, ‘డార్లింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాలు నిర్మించిన ఆయన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై దర్శకుడు కరుణాకర్ వద్ద సహాయకుడిగా పనిచేసిన చంద్రమోహన్ చింతాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ సరసన లావణ్యాత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాత తెలియజేస్తూ.. కరుణాకర్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన చంద్రమోహన్ మంచి కథ చెప్పాడని, కథ విన్న శర్వానంద్ కూడా ఇంప్రెస్ అవడంతో అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. జూన్ 1నుంచి నాన్‌స్టాప్‌గా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని, త్వరలోనే పూజాకార్యక్రమాల్ని ప్రారంభిస్తామని, మిగతా నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తామని అన్నారు.