కుర్రాళ్ల గుండెచప్పుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సమర్పణలో పెదరావూరు ఫిల్మ్ సిటీ బ్యానర్‌పై దర్శకుడు దిలీప్ రాజా తెరకెక్కిస్తోన్న చిత్రం -యూత్. కుర్రాళ్ల గుండెచప్పుడు ఉప శీర్షిక. టైటిల్ అనౌన్స్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ -నేటి సమాజంలో కుర్రాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తెలియజెప్పే చిత్రమిది. మెర్సీకిల్లింగ్ కోరుకున్న 22ఏళ్ల కుర్రాడిని.. ఎందుకు? అని జడ్జి వేసిన ప్రశ్నకు సమాధానంగా కథాసారాంశం ఉంటుంది. ప్రతి కుర్రాడు ఈ కానె్సప్ట్‌కు కనెక్టవుతాడన్న నమ్మకముంది. మార్చినుంచి రెగ్యులర్ షూట్ మొదలుపెడతాం. లీడ్‌రోల్‌లో ధన్యబాలకృష్ణ, విలన్ పాత్రలో అలోక్‌జైన్, బాలీవుడ్, తమిళ ఆర్టిస్టులు చిత్రంలో చేస్తున్నారు. వెంటిలేటర్ మీదున్న చిన్న సినిమాను ఆదరించి బతికించమని ప్రభుత్వాలను, ఆడియన్స్‌ని కోరుతున్నా అన్నారు. హీరోయిన్ రావత్ సింధు మాట్లాడుతూ -సినిమాలో నేను పోషించిన పాత్రతో మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్నా. సబ్జెక్టు విన్నపుడు కన్నీళ్లొచ్చాయి. యూత్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. పండుగాడి ఫొటో స్టూడియో తరువాత దిలీప్‌రాజా దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి సంగీతం యాజమాన్య, సినిమాటోగ్రఫీ మల్లికార్జున్ అందిస్తున్నారు.