కుమ్మరిగా...డ్రైవర్‌గా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ తార అనుష్క శర్మ ఇప్పుడు మట్టితో కుండలు చేయడం నేర్చుకుంటోంది. పనిలోపనిగా హర్యానాలోని పంటపొలాల్లో ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటోంది. మొన్నటికి మొన్న మల్లయుద్ధంలో మెళకువులు నేర్చుకుంది. ఇందంతా ఎందుకోసమో అనుకోకండి. సల్మాన్‌ఖాన్ హీరోగా నిర్మిస్తున్న ‘సుల్తాన్’లో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తను పోషిస్తున్న పాత్రలో రాణించడానికి కావలసిన అన్ని అంశాల్లో తర్ఫీదు పొందుతోంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పేర్కొంటూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. బాక్సింగ్ రింగ్‌లో ఆమె చేస్తున్న పోరాడుతున్న ఫొటోను పోస్ట్ చేసిన అనుష్కశర్మ ఇప్పుడు తాజాగా ట్రాక్టర్ నడుపుతున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది.