వీర.. పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీఎంట్రీకి రెడీ అయిన తరువాత పవన్ పాకెట్‌లో మూడు ప్రాజెక్టులున్నాయి అనేవాళ్లు కొందరు. కాదు, అనధికారికంగా ఐదున్నాయి అనేవాళ్లు ఇంకొందరు. ఏదేమైనా పవన్ రీ ఎంట్రీ సెనే్సషన్ అన్నది కాదనలేని వాస్తవం. దాదాపుగా ‘పింక్’ పార్ట్ పూర్తి చేసేసిన పవన్, తదుపరి క్రిష్‌తో సెట్స్‌మీదకు వెళ్లనుండటం తెలిసిందే. అదొక పీరియాడికల్ సినిమా కావడం, పాన్ ఇండియా లెవెల్లో రానున్న స్ట్రెయిట్ మూవీ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా అదెప్పుడా? అనే. అందుకే క్రిష్ ప్రాజెక్టుపై అంచనాలు వినిపిస్తున్నా -అప్‌డేట్స్‌లా ఫీలై ఆసక్తిగా ఫాలో అయిపోతున్నారు. క్రిష్ ప్రాజెక్టు కోసం గడ్డం తీసేని ఫ్రెష్ లుక్ ఇచ్చిన పవన్, టాటూనీ వేయించుకోవడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. తాజ కథనాల్లో భాగంగా -సినిమాలో పవన్ పాత్ర పేరు వీర అని, వైవిధ్యమైన టైటిల్స్ పెట్టే క్రిష్ కథానాయకుడి పేరు కలిసొచ్చేలా ‘విరూపాక్ష’ పెట్టాడనీ ప్రచారం జరుగుతోంది. పైగా పవన్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారన్నది మళ్లీ వినిపిస్తోన్న మాటే. ఒక పాత్రకు కైరా అద్వానీ, మరో పాత్రకు కీర్తిసురేష్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులో కీలక పాత్ర కోసం అనసూయకు చాన్స్ ఇస్తున్నట్టూ కొన్నిరోజులుగా వినిపిస్తోన్న మాట. ఇవన్నీ బయటకు పొక్కుతోన్న కథనాలేనా? వాస్తవాలు కూడానా? అన్నది చిత్రబృందం అప్‌డేట్స్ ఇచ్చేవరకూ ఆగాల్సిందే.