అమ్మ.. గతిని మార్చనుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ వస్తుంది. చెడుమార్గంలో ప్రయాణిస్తున్న సమాజాన్ని తిరిగి సన్మార్గంలో పెట్టేందుకే వస్తుంది. అంకురంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన దర్శకుడు సి ఉమామహేశ్వర రావు రూపొందిస్తున్న తాజా చిత్రం -ఇట్లు అమ్మ. మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అనేది ఉపశీర్షిక. మంచి సమాజావిష్కరణకు సమాజంలోని అమ్మలంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చే సినిమా. బొమ్మక్ క్రియేషన్స్ పతాకంపై బొమ్మక్ మురళి నిర్మిస్తోన్న సినిమా టైటిల్ లోగోను సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో అల్లు అరవింద్, మహిళా సంఘాల నేతలు దేవి, విమల తదితరులు పాల్గొన్నారు. లోగో ఆవిష్కరించిన అల్లు అరవింద్ మాట్లాడుతూ -అంకురం సినిమా చూసినపుడు ఆ దర్శకుడు ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి కలిగింది. అలా నేను ఫీలయ్యే దర్శకుల్లో బాలచందర్ కూడా. వ్యవస్థలతో పోరాడుతూ సామాజిక సంక్షేమం కాంక్షతో కథలు రాసి సినిమా తీసేవాళ్లలో ఉమామహేశ్వర రావులాంటి వాళ్లు కొద్దిమందే ఉంటారు. నిర్మాత బొమ్మక్ మురళి అంకితభావంతో సినిమా తీశారని తెలుస్తోంది. సమాజం మీద ఈ సినిమా ప్రభావం చూపించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ -ప్రపంచ హింస, భేదాల వల్ల ఎక్కువ వేదనకు గురయ్యేది స్ర్తి. ముఖ్యంగా అమ్మ. ప్రపంచగతిని మార్చే శక్తి స్ర్తిలకు ఉంది అనేది నా నమ్మకం. అలాంటి సమాజం కోసం తల్లులంతా ఏకమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయమే ఈ సినిమా ద్వారా చెబుతున్నా. ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి తన అభిప్రాయాన్ని గొంతెత్తి చెప్పే మహిళా ప్రయత్నమే ఈ కథ. అలాంటి కథలో సహజ భావోద్వేగాలు చూపించే నటి కావాలి. ఆ సమర్థతవున్న నటి రేవతి అన్నారు. నిర్మాత బొమ్మక్ మురళి మాట్లాడుతూ -ఓ మంచి చిత్రాన్ని నిర్మించాలనే నా కల ‘ఇట్లు అమ్మ’తో తీరింది. దర్శకుడు ఉమామహేశ్వర రావు, సినిమాటోగ్రాఫర్ మధు అంబట్‌లాంటి గొప్ప వ్యక్తులతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను త్వరలోనే ఆడియన్స్ ముందుకు తెస్తాం అన్నారు. నటి రేవతి మాట్లాడుతూ -ఒక అమ్మ ప్రయాణమే సినిమా. మధ్య వయస్సులోనూ తాను నేర్చుకోవాల్సింది ఉంటుందని, మార్పు తీసుకురాగలది చెప్పే అరుదైన కథ ఇది. కథను దర్శకుడు అద్భుతంగా మలిచారు. ఉరుములు మెరుపులు పడుతున్న రాత్రి అనే వాక్యంతో మొదలైన కథలో.. ఆ ఒక్క సన్నివేశం చిత్రీకరించేందుకు దర్శకుడు 12 రాత్రులు తీసుకున్నారు. అంటే -జీవితం ఎలా సాగుతుందో అంతే సహజత్వంతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. ఇట్లు అమ్మ సందేశాలివ్వదు. గొంతెత్తి కేకలు వేయదు. మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది అన్నారు. మధుమిత, రవికాలె, పోసాని కృష్ణమురళి, అరువీ బాల, ప్రశాంత్, వినీత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న చిత్రానికి సంగీతం సన్నీ ఎంఆర్ సమకూరుస్తున్నారు.