అసలు బ్రహ్మోత్సవం అప్పుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత ముఖ్యపాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ సీడీని ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నారని, వారిని డీల్ చేయగలనా అనిపించిందని, కానీ మహేష్‌బాబు సపోర్ట్‌తో బాగా చేశానని, ఆయనతో రెండోసారి కలిసి పనిచేయడం తిరుపతి వేంకటేశ్వరస్వామి పాదాల్ని దృష్టిలో పెట్టుకొని టైటిల్ పెట్టానని, దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.
మహేష్‌బాబు మాట్లాడుతూ, ఈ సినిమాలో పెద్దపెద్ద నటీనటులతో పనిచేశానని, వారినుండి చాలా నేర్చుకున్నానని, ఈ సినిమాలో విజువల్స్ ఇంత అందంగా వుండడానికి తోట తరణి కారణమని, అర్జున్ సినిమాకు కూడా మధురై టెంపుల్ సెట్ వేశారని, అది నా లైఫ్‌లో మర్చిపోలేనని. ఈ చిత్రానికి రత్నవేలు అద్భుతమైన ఫొటోగ్రఫీ అందించాడని, అలాగే మిక్కీ మంచి పాటలు ఇచ్చాడని అన్నారు. శ్రీకాంత్ అడ్డాల అంటే తనకు ఇష్టమని, ఆయన కథలు రియల్ లైఫ్‌కి దగ్గరగా వుంటాయని, శ్రీకాంత్‌తో మరిన్ని సినిమాలు చేయాలని వుందని అన్నారు. అలాగే నిర్మాత పి.వి.పి. సినిమా అంటే పాషన్ వున్న వ్యక్తని, తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అభిమానులేనని, మనందరికీ ఈనెల 20నుండి బ్రహ్మోత్సవాలు మొదలౌతాయని అన్నారు.