దటీజ్ తేజ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత దశాబ్దకాలంలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ లేకున్నా -దర్శకుడు తేజను మామూలు దర్శకుల జాబితాలో పెట్టి చూడలేం. ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా.. తట్టుకుని లేచి నిలబడి ప్రయోగాలకు సిద్ధపడే మొండిఘటంగా తేజ ఎప్పుడో పేరు పడిపోయాడు. టాలీవుడ్‌లో సంప్రదాయ ప్రేమ కథా చిత్రాలకు ఓ కొత్త టర్న్ ఇచ్చిన దర్శకుల్లో తేజ పేరు ప్రస్తావించకుండా ఉండలేం. కొత్తవాళ్లకు ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో -తేజ పేరు ఎప్పుడూ అగ్రభాగానే ఉంటుంది. అయితే, సరైన సినిమా పడకపోవడంతో -తేజ పనైపోయిందన్న నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడో వచ్చేసింది. అయితే, తేజ పద్ధతిని ఇష్టపడే హీరోలు మాత్రం అవకాశాన్నిబట్టి ప్రాజెక్టులకు ఓకే అంటున్నారు. ఆమధ్య తేజతో రానా చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి విజయమే సాధించింది. తేజతో మరో సినిమా చేయడానికి రానా సిద్ధపడటంతో -అతని కోసం ‘రాక్షస రాజు రావణుడు’ టైటిల్‌ని తేజ రిజిస్టర్ చేయడం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే, దీంతో సమాంతరంగా మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు తేజ ఓ ప్రయోగం చేస్తున్నాడన్న మాట వినిపిస్తోంది. గోపీచంద్‌తో తేజ సినిమా ఉండొచ్చంటూ వినిపించిన కథనాలను నిజం చేస్తూ -హీరో కోసం ‘అలివేలు వేంకటరమణ’ టైటిల్‌ని రిజిస్టర్ చేయించినట్టు వినిపిస్తోంది. సమాంతరంగా రెండు ప్రాజెక్టులు డీల్ చేయడానికి సిద్ధపడుతున్న తేజను -నిజంగా మొండిఘటం అంటోంది ఇండస్ట్రీ.