ఇప్పటికిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరల్డ్ ఫేమస్ లవర్‌గా విజయ్
దేవరకొండను చూపించేందుకు రెడీ అయ్యాడు దర్శకుడు క్రాంతిమాధవ్. ప్రేమలోని విభిన్న కోణాలను వైవిధ్యంగా చూపించనున్న కథలో రాశిఖన్నా,
క్యాథరిన్ థ్రెసా, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లు. క్రియేటివ్ కమర్షియల్స్‌పై తెరకెక్కిన చిత్రం -్ఫబ్రవరి 14న థియేటర్లకు వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం విజయ్ మీడియాతో ముచ్చటించాడు.
* సైన్స్ ఫిక్షన్ స్టోరీ కోసం గడ్డం పెంచినా -అర్జున్‌రెడ్డి కంటెంట్‌తో కంపారిజిన్స్ చేసే పరిస్థితి వుంది. దాన్ని మనమేం చేయలేం. బట్, నేను చెప్పేదొకటే. ఈ కథతో అర్జున్‌రెడ్డికి పోలికే ఉండదు. ఈ కథలో మూడు లవ్ ట్రాక్‌లు. వాటిలో ఒకటి అర్జున్‌రెడ్డి ఫ్లేవర్‌తో ఉండటం వల్ల పోలికలు తెస్తున్నారని అనుకుంటున్నా.
*నిజానికి డబ్ల్యుఎఫ్‌ఎల్ -విచిత్రమైన సినిమా. ఈ ఫార్మాట్‌లో ఇంతవరకూ నేను సినిమా చేయడం కాదు, చూడనైనా చూళ్లేదు.
*ఇక ప్రేమ కథలు చేయనని అన్నానంటే -కమర్షియల్ సినిమాలే చేస్తాననీ కాదు అర్థం. దర్శకుడు పూరితో చేస్తున్న కథలో చిన్న లవ్ థ్రెడ్ ఉండొచ్చు. సో, నా ఉద్దేశం అర్జున్‌రెడ్డి, డియర్ కామ్రేడ్‌లాంటి పూర్తి ప్రేమకథలు చేయనని. కొత్తగా అన్నిరకాల కథలూ చేయడం నాకూ మంచిది, ఆడియన్స్‌కీ నచ్చుతుంది.
*ఈ కథలో ఐశ్వర్యరాజేష్‌తో ఓ గ్రౌండ్ రియాలిటీ లవ్ స్టోరీ ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో ఎల్లందుగా నేను చేసిన పాత్ర నన్ను కదిలించింది. దానికి పూర్త్భిన్నంగా ఓ పాష్ లవ్ స్టోరీనీ ఎంజాయ్ చేశా. అందుకే ఈ చిత్రాన్ని -ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నా. నిజంగానే మజానిచ్చిన సినిమా ఇది.
*సినిమాలో వేర్వేరుగా మూడు ప్రేమకథలున్నా -వాటిమధ్య రిలేషన్ ఉంటుంది. (మూడు కథల్లో కనిపించేది నేనేగా..-నవ్వుతూ). బట్, ఆ రిలేషన్ ఏమిటనేది స్క్రీన్‌పైనే చూడాలి.
*నేను చేసిన ఈ వైవిధ్యమైన ప్రేమ కథ దర్శకుడు క్రాంతిమాధవ్ బ్రెయిన్ చైల్డ్. ఆయన రైటింగ్ స్కిల్స్ అమోఘం. క్రెడిట్ మొత్తం ఆయనకే. కెమెరామెన్ జయకృష్ణ గుమ్మాడి, నిర్మాత కెఎస్ రామారావులు ప్రాజెక్టుకు ఎక్స్‌ట్రా బలం.
*నా కెరీర్‌లో హార్డెస్ట్ మూవీ -డబ్ల్యుఎఫ్‌ఎల్. పాత్రలలో వేరియేషన్స్ కోసం భౌతికంగా, మానసికంగా ఎక్కువ సన్నద్ధత అవసరమైంది. సిక్సర్ కోసం ట్రై చేసినా. ప్రస్తుతం బంతి గాల్లో ఉంది. బౌండరీ లైన్ అవతల పడుతుందో, క్యాచ్‌కి దొరికిపోతుందో చూడాలి (నవ్వుతూ).
*డబ్ల్యుఎఫ్‌ఎల్‌కు ముందు -కథలో భాగంగా ప్రియం, ముంబైతీరం లాంటి టైటిల్స్ సైతం పరిశీలనకు వచ్చాయి. కాకపొతే -1960కాలంనాటి టైటిల్స్‌లా అనిపించి పక్కన పెట్టేశాం. ఫైనల్‌గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టైటిల్‌కి ఫిక్సైపోయాం.
*నాగురించే మాట్లాడటం.. నన్ను ప్రత్యేకంగా చూడటం చూస్తుంటే.. ‘ఏంట్రా మనం’ అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ‘ఇంకేం కావాలి’ అనీ అనిపిస్తుంటుంది. (నవ్వుతూ.. నాకైతే ఇండియాని రూల్ చేయాలని ఉంది).
*ఒకప్పుడు ప్రేమనేది నానె్సన్స్ కానె్సప్ట్ అనుకునేవాడిని. ఫ్రెండ్స్ వాళ్ల లైఫ్ ఇన్సిడెంట్స్‌ని చెప్తుంటే -విని కన్ఫ్యూజయ్యేవాడిని. బట్, ఇప్పుడు ప్రేమపై దృక్ఫథం మారింది. అమ్మానాన్నలు, తోబుట్టువులు, బంధువులు, భార్య, పిల్లలు.. ఈ లవ్‌లో ఓ బాధ్యత, త్యాగం, దైవత్వం.. అన్నీ ఉన్నాయనిపిస్తోంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఈ లవ్వుండాలి.
*లైఫ్‌లో -పెళ్లి చేసుకుంటా. కానీ, ఇంకా సిద్ధంగా లేనని తెలుస్తోంది. ఇంకా పిల్లాడినే అనుకుంటున్నా. పెళ్లి అనేది పెద్ద బాధ్యత. కొంతకాలం తరువాత ఆలోచిస్తా.
*నేను నాలా ఉండటమే ఇష్టం. రెస్ట్రిక్షన్స్‌తో జనరేషన్స్‌ని ఆపేయడాన్ని భరించలేను. అందుకే -నేను చేసే పని నా నిర్ణయం మేరకే ఉంటుంది కనుక దాని ఫలితం ఎలావున్నా నా బాధ్యతగా స్వీకరిస్తా.
*సోషల్ మీడియాలో నాపై వస్తున్న సెటైర్స్, మీమ్స్‌ని ఎంజాయ్ చేస్తా. మంచిదైనా, చెడ్డదైనా.. గంటల తరబడి కూర్చొని నామీద మీమ్స్ తయారు చేస్తున్నారంటే నాపై ఎంత ప్రేమ ఉండుండాలి? కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని బాగా ఇష్టపడతా.
లైఫ్ జర్నీలో -కాలానుగుణంగా కొన్ని ఫేజ్‌లు
ఫేస్ చేస్తామేమో. నేను.. చుట్టూ ప్రపంచం.. ఇప్పటి వరకూ సాగిన జర్నీ.. అనుభవంలోకి వస్తోన్న అంశాలు.. వీటన్నింటి ప్రభావంతో కొత్త ఫేజ్‌లోకి వెళ్తున్నట్టే తెలుస్తోంది. మాట, ప్రవర్తన, ఆలోచన....
ఇప్పటికి ఇలావున్నాను. రెండు మూడు నెలల్లో -అన్ని విధాలా కొత్త ఫేజ్‌లో కనిపిస్తా.
అదేమిటి? అన్నది అప్పుడు చెప్తా.