తేజ్ మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాచిలర్ లైఫ్‌లోనే కిక్కుందని ఫీలయ్యే కుర్రాడు -కొత్త అప్‌డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గత ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే చిత్రంతో హిట్టందుకున్న సాయితేజ్ -వైవిధ్యమైన కథతో ఉత్సాహంగా చేస్తోన్న సినిమా.. సోలో బ్రతుకే సో బెటరు. జోడీగా నభానటేశ్ చేస్తున్న సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ ప్రాజెక్టు నుంచి గురువారం ఓ వీడియోను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టరేసి మరీ ప్రకటించింది చిత్రబృందం. వరుస ఫ్లాపుల సీజన్‌కు చిత్రలహరితో ఫుల్‌స్టాప్ పడటంతో -సోలో బ్రతుకే సో బెటర్ తనకు హిట్టునిచ్చి కెరీర్‌ను సక్సెస్ ట్రాక్‌లో కాస్త ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకంతో ఉన్నాడు తేజ్.