శక్తిగా.. శివకార్తికేయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనటుడు శివకార్తికేయన్, కళ్యాణి ప్రియదర్శన్ జోడీగా కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా అందిస్తోన్న సినిమా -శక్తి. పిఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రాన్ని తెలుగులో కోటపాడి జె రాజేష్ అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశామని దర్శకుడు మిత్రన్ చెబుతూ -విద్యావ్యవస్థపై ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ శంకర్ రూపొందించిన జెంటిల్‌మెన్ చిత్రమే గుర్తొస్తుంది. అందుకేఏమాత్రం తీసిపోని కథనంతో చిత్రాన్ని సామాజిక స్పృహవున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం. సీరియల్ ప్రభావంతో సూపర్‌మెన్ అవుదామనుకున్న అబ్బాయి, రియల్ లైఫ్‌లో చేసిన స్టంట్‌లు ఏంటి? తండ్రి సలహాతో జీవితంలో ఎలా సెటిలయ్యాడు? సూపర్‌మెన్ తరహాలో అతను చేసిన పనులేంటి? అన్న కథనంతో చిత్రం వైవిధ్యంగా సాగుతుందని తెలిపారు. నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ -హీరోకు విద్యావ్యవస్థలోని లోపాలను గుర్తుచేసి, అతను ఆ లోపాలను ఎలా సరిదిద్దాడనే ఆసక్తికర విషయాలు సినిమాలో ఉంటాయన్నారు. యూనివర్సల్ సబ్జెక్ట్ కనుక తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని, వాస్తవ ఘటనలను కథలో చర్చించామని, ప్రేక్షకులను ఆలోచింపచేసే చిత్రమన్నారు. అభయ్ డియోల్ విలన్‌గా నటిస్తున్న చిత్రంలో డైలాగులు వైవిధ్యంగా ఉంటాయని, భావితరాలు ఎలా ప్రోత్సహిస్తే అభివృద్ధి చెందుతారో చిత్రంలో చెబుతున్నామని, త్వరలోనే సెన్సార్ పూర్తిచేసి త్వరలోనే సినిమాను ఆడియన్స్ ముందుకు తెస్తామన్నారు.