సింగిల్ కింగులం అంటున్న సందీప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సందీప్ కిషన్ నుంచి రానున్న తాజా ప్రాజెక్టు -ఎ1 ఎక్స్‌ప్రెస్. లావణ్య త్రిపాఠి హీరోయిన్. హాకీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన తెలుగు చిత్రం న్యూ ఏజ్ స్పోర్డ్స్ ఎంటర్టైనర్గా ఆసక్తి రేకెత్తిస్తోంది. దర్శకుడు డెన్నిస్ జీవన్ కొలను తెరకెక్కిస్తోన్న చిత్రం ముగింపు దశకు చేరుకుందని, వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామంటూ తాజాగా చిత్రబృందం ప్రకటించింది. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పనె్నం నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే చిత్రానికి సంబంధించి ‘సింగిల్ కింగులం’ అనే పాటను తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి రొమాన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చిత్రబృందం చెబుతోంది. రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్ తదితరులు నటిస్తోన్న చిత్రానికి కవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు.