ఫైనల్‌గా.. ఫేజేంటో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఫేజ్‌లోకి వెళ్తున్నానంటూ రౌడీ బోయ్ ఒక్క కామెంట్ చేసి -‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడ’న్నంత పాపులార్టీ కొట్టేశాడు. తనకున్న క్లారిటీతో -ఇండస్ట్రీని కన్ఫ్యూజ్ చేసి.. తనగురించి ఎక్కువ ఆలోచించేలా చేసినట్టే కనిపిస్తోంది. ఈ డైలాగ్ వదిలిన దగ్గర్నుంచీ -విజయ్ దేవరకొండకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ‘కొత్త ఫేజ్’లో చూడాల్సిన పరిస్థితీ కనిపిస్తోంది. తాజాగా విజయ్ కొత్త ఫేజ్‌ను -పూరీ కనెక్ట్స్‌కి కనెక్ట్ చేసీ చూస్తున్నారు రౌడీ బోయ్స్. సహజంగానే తన హీరోలకి మాస్ ఇమేజ్‌నివ్వటంలో దర్శకుడు పూరి సిద్ధహస్తుడు. క్లాసిక్ కంటెంట్‌లోనూ -హీరోలకు మాస్ ఇమేజ్‌ని ఆపాదించటానికి ఎక్కడా తగ్గడు. తాజాగా విజయ్ దేవరకొండతో పూరి ప్రాజెక్టు ‘లైగర్’ మొదలవుతోంది. సో, విజయ్ దేవరకొండ డైలాగ్‌ని ఇప్పుడు ఈ కోణంలోనూ చూస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ‘ఎల్లందు’ లవ్‌స్టోరీ తనను కదిలించిందని చెబుతూ -ఇక ప్రేమ కథలకు దూరంగా ఉంటానన్న కాంట్రాస్ట్ డైలాగ్ వదిలాడు. అదే టైంలో నానె్సన్స్ అనుకున్న లవ్ కానె్సప్ట్‌మీద తన అభిప్రాయం మారుతోందనీ, అందులో దైవత్వం కూడా ఉందన్న భావన వ్యక్తం చేశాడు. సో, ఇప్పటి వరకూ చేసిన ‘బోల్డ్’ లవ్ స్టోరీలు.. ఇంపాక్ట్ చూపించిన డబ్ల్యుఎఫ్‌ఎల్ కథతో -ఆ తరహా చిత్రాలకు దూరంగా ఉండేందుకే ‘ఫేజ్’ను మారుస్తున్నాడన్న భావన కలిగింది. ఇప్పుడు -పూరి తెరకెక్కిస్తోన్న ‘లైగర్’ కోణంలో చూస్తే.. రౌడీ బోయ్స్‌ని లైనప్ చేయడానికే ఈ డైలాగ్ వదిలాడన్న చర్చా మొదలైంది. ‘లైగర్’ సెట్స్‌పైకి వెళ్లడానికి రంగం సిద్ధమైంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో రానున్న ప్రాజెక్టు కావడంతో -షూటింగ్‌ను ముంబైలో మొదలెడుతున్నారు. నిర్మాణ భాగస్వామి కరణ్‌జోహార్ వత్తిడిమేరకు ముంబై పార్ట్‌ని -ప్రత్యేకంగా ఐదు కోట్లతో వేస్తోన్న సెట్‌లో లాగిస్తారట. డబ్ల్యుఎఫ్‌ఎల్ ప్రమోషన్స్ పూర్తవ్వడంతో -గురవారం నుంచే ‘లైగర్’లో విజయ్ జాయినయ్యే అవకాశం ఉందంటున్నారు. అద్భుతమైన ప్రేమకథలు ఎన్ని చేసినా -మాస్ యాక్షన్ మూవీస్‌లో హీరోలకు వచ్చే ఇమేజ్ రానేరాదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే -క్లాసిక్ లవ్‌కి కొంతకాలం క్రాప్‌హాలిడే ఇచ్చేసి.. యాక్షన్ హీరో ‘ఫేజ్’ ట్రాన్స్‌ఫార్మేషన్‌కి విజయ్ ట్రై చేస్తున్నాడన్న చర్చ వినిపిస్తోంది. ఏదేమైనా విజయ్ ‘ఫేజ్’ మారడం ఖాయం. ఆ ఫేజ్ ఏంటి? అన్నది రౌడీబోయ్ క్లారిటీగానే ఉన్నాడు. రెండు మూడు నెలల్లో మీరే చూస్తారుగా అంటూ -ఇండస్ట్రీని మాత్రం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఫైటర్ ప్రాజెక్టుతో విజయ్ బాలీవుడ్‌లో లాంచవుతుంటే, దర్శకుడు పూరి జగన్నాథ్‌కి మాత్రం రీలాంచ్ సినిమా ఇది. ఫ్రైటర్‌తో -స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 బ్యూటీ అనన్యపాండే జోడీ కడుతోందన్నది తాజా సమాచారం.