వ్వాట్టే.. బ్యూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్ బీచ్‌లో రెడ్ వైన్ షేరింగ్‌తో కుర్రకారుకు కిక్కిస్తోంది నితిన్ -రష్మిక జోడీ. వరుసగా పెద్ద సినిమాల్లో అనూహ్య అవకాశాలు వస్తుండటంతో -పొందికను పక్కనపెట్టేసి.. పోష్ గ్లామర్‌కు ఎప్పుడో గేట్లు ఎత్తేసింది రష్మిక. ఇప్పటికే కుర్రకారు గుండెల్లో గ్లామర్ గుడిసె వేసెయ్యడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నితిన్‌తో చేస్తున్న భీష్మ ప్రాజెక్టు కోసం -మరో రెండడుగులు ముందుకెళ్లిందన్న మాట వినిపిస్తోంది. అన్ లిమిటెడ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన రష్మిక -ఈ ప్రాజెక్టుకు స్పెషల్ అట్రాక్షన్ అన్న మాట వినిపిస్తోంది. అందుకే -నితిన్‌తో రష్మిక కెమిస్ట్రీని రహస్యంగా చూపిస్తూ వదిలిన పోస్టర్లు సినిమాపై ఆసక్తికంటే ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే మహతి సాగర్ ఇచ్చిన మ్యూజిక్ ఫీస్ట్‌కి కుర్రాళ్లు బలంగానే కనెక్టవ్వడంతో -సాంగ్స్‌తోనే యూత్‌ని ఫిదా చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 21న థియేటర్లకు వస్తోంది. వ్వాటే బ్యూటీ అంటూ రష్మిక వెంట పడుతున్న భీష్మ -ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.