శివ 143తో విలన్‌గా మరో మెట్టెక్కుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాతగా కెరీర్ మొదలెట్టిన డిఎస్ రావు -వరుసగా సినిమాల్లో బిజీ అవుతున్నారు. తాజాగా శివ 143 చిత్రంలో విలన్ పాత్ర చేశారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. -ఒకసారి ఓ మీటింగ్‌లో నన్ను చూసిన దర్శకుడు తేజ.. నా తరువాతి చిత్రంలో మీరే విలన్ అన్నారు. ఆశ్చర్యపోయి నిజమేనా అని అగాను. అలా మొదటిసారి హోరా హోరీ సినిమాలు విలన్ పాత్ర చేశా. అక్కడినుంచి వరుసగా చేస్తూ ఇప్పటికి 30 సినిమాలు పూర్తి చేశా. ఈ ఏడాది నిర్మాతగా ఓ పెద్ద సినిమా చేసే ఆలోచనలో ఉన్నా. ఇక, నిర్మాత రామసత్యనారాయణ రూపొందించిన శివ 143 చిత్రంలో మంచి పాత్ర చేశా. విలన్‌గా నాకు మరింత గుర్తింపు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నా. డైరెక్టర్ శైలేష్ సాగర్ మంచి కథ రాసుకున్నాడు. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. శుక్రవారం థియేటర్లకు వస్తున్న సినిమా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేయాలని ఉంది. త్వరలో వారి సినిమాల్లోనూ చాన్స్‌లు వస్తాయన్న నమ్మకం ఉంది. నా భవిష్యత్ ప్రణాళిక ఏమిటన్నది త్వరలోనే చెబుతా అన్నారు.