లీగ్ మారినట్టేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నానిని విలన్‌గా చూపిస్తూ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చేస్తోన్న తాజా ప్రాజెక్టు -‘వి’. క్లాస్ డైరెక్టర్ ముద్రనుంచి బయటికొచ్చి -హీరోయిజాన్ని ఎలివేట్ చేయగల సినిమాలూ చేయగలనని రుజువు చేసుకోడానికి ఇంద్రగంటి ఓ ప్రయత్నం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అష్టాచెమ్మాతో మొదలైన ఇంద్రగంటి కెరీర్ సమ్మోహనం వరకూ చేసిన ఆరు చిత్రాల్లో ఎక్కువ శాతం సాఫ్ట్ క్లాసిక్సే. వీటిలో నానితో చేసిన ‘జెంటిల్‌మేన్’ ఒక్కటే -ఆయన శైలి నుంచి కాస్త పక్కకు వచ్చి చేసిన సినిమాగా కనిపిస్తుంది. తొలిసారి మాస్ లీగ్‌లోకి వచ్చిన ఇంద్రగంటి -వి ప్రాజెక్టును హాలీవుడ్ స్టయిల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయగల దర్శకుడిగా ఎలివేట్ అయ్యేందుకు -వి ప్రయత్నాన్ని బలంగానే వాడుకుంటున్నట్టు చిత్రబృందం నుంచి వినిపిస్తోన్న మాట. నానిని పూర్తిస్థాయి విలన్‌గా చూపిస్తూనే, హీరో సుధీర్‌బాబుకి రఫ్ క్యారెక్టర్‌ని డిజైన్ చేసి -ఇద్దరిమధ్యా ‘యాక్షన్ వార్’తో కథ నడిపించే అవకాశం ఉందని అంటున్నారు. వి ప్రాజెక్టు నుంచి 17న టీజర్ రానుంది. క్లాస్ డైరెక్టర్ మాస్ స్టామినా ఎంతన్నది -టీజర్‌తో ఓ అంచనాకు రావొచ్చు.