బల్‌దేవ్‌గా.. రానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ పాత్రలపై ఆసక్తిచూపే రానా కొంత గ్యాప్ తరువాత వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ బల్‌దేవ్‌గా వస్తోన్న పాన్ ఇండియా మూవీ -అరణ్య. హిందీలో హాథీ మేరీ సాథీ, తమిళంలో కాడన్ టైటిల్స్‌తో విడుదలకానుంది. గుబురు గడ్డం, మాసిన దుస్తుల్లో.. అడవిని హరిస్తోన్న వ్యక్తులపై ఆగ్రహాన్ని చూపిస్తూ ఫస్ట్‌లుక్‌తో ఇప్పటికే ఇంపాక్ట్ చూపించాడు రానా. వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల భరతంపట్టే బల్‌దేవ్‌గా టీజర్‌తో మరింత ఆసక్తి పెంచాడు. తాజాగా -హిందీ, తమిళ భాషల్లో టీజర్ విడుదలైంది. అడవి జంతువులకు ఆప్తుడైన టార్జాన్ తరహా విన్యాసాలు చూపించి సినిమాపై ఆసక్తిని పెంచాడు రానా. జంతువులకే అర్థమయ్యే సంకేత శబ్దాలు, అమాయకత్వం, మొరటుదనం కలబోసిన ఎక్స్‌ప్రెషన్స్‌తో బిగ్ సర్‌ప్రైజే ఇచ్చాడు. గజరాజు చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కిస్తోన్న సినిమాలో రానా బాడీలాంగ్వేజ్‌ని వైవిధ్యంగా చూపించటం ఆసక్తికరం. బాలీవుడ్ బ్యూటీలు జోయా హుస్సేన్, శ్రీయ పిల్లావోంకార్ హీరోయిన్లు. తమిళంలో ఆసక్తికరమైన పాత్రను విష్ణువిశాల్ పోషిస్తుంటే, అదే పాత్రను హిందీలో పులకిత్ సమ్రాట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 2న విడుదల కానుంది.