ఎన్టీఆర్‌కు అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివగంత ఎన్టీఆర్ సినిమాలోని ఓ పాటనుంచి సినిమా టైటిల్ తీసుకున్నాం. అందుకే -నా చిత్రాన్ని ఆయనకే అంకితిమిస్తున్నా అంటున్నాడు కొత్త దర్శకుడు సురేష్ తిరుమూర్. ఈయన తెరకెక్కించిన చిత్రం -లైఫ్ అనుభవించు రాజా. రవితేజ, శ్రావణి నిక్కీ, శృతిశెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శుక్రవారం థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంలో సురేష్ మీడియాతో మాట్లాడుతూ -ఈ క్షణంలో బతకాలన్నదే సినిమా టైటిల్ అర్థం. అందుకే లైఫ్.. అనుభవించు రాజా అని పెట్టా. ఒక యువకుడు జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ చూశాడు. మంచి చెడులను ఎలా ఫేస్ చేశాడు. కోటీశ్వరుడు కావాలన్న కోరిక నెరవేరిందా? ప్రేమలో సక్సెస్ అయ్యాడా? డబ్బున్నపుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు. లేనపుడు ఎలా ఉంటారన్న అంశాలే కథలో ప్రధానాంశంగా ఉంటాయి. యుతవ ఆదర్శంగా తీసుకోతగ్గ సినిమా ఇది. కంటెంట్ ఉంటే సినిమాను ఆదరిస్తారన్న విషయం ఇటీవలి కాలంలో అనేక చిత్రాలు రుజువు చేశాయి. ఆ ధైర్యంతోనే కొత్తవాళ్లతోనే సినిమా చేశాను. కొత్తవాళ్ల కారణంగా ఓపెనింగ్స్ ఉండకపోవచ్చుకానీ, కంటెంట్ బావుంటే సినిమా పుంజుకునే అవకాశం లేకపోదు. పాత్రల పరిచయం తరువాత ఆర్టిస్టులెవ్వరూ కొత్తవాళ్లనిపించరు. అంత చక్కగా చేశారన్నారు.