ఆసక్తికరంగా రావణ లంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావణ లంక. ఆసక్తికరమైన క్యాచీ టైటిల్‌తో కె సిరీస్ మూవీస్ ఫ్యాక్టరీ నుంచి సినిమారానుంది. మురళీ శర్మ, దేవ్‌గిల్ ప్రధాన పాత్రలుగా క్రిష్ సమర్పణలో బిఎన్‌ఎస్ రాజు తెరకెక్కిస్తోన్న చిత్రమిది. క్రిష్, అస్మిత, త్రిష నాయకా నాయికల పాత్రలు పోషిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి సంబంధించి పాట వినా మిగతా షూటింగ్ పూరె్తైనట్టు చిత్రబృందం వెల్లడించింది. పోస్ట్ ప్రొడక్షన్స్ దశకు చేరిన ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్శంగా దర్శకుడు బిఎన్‌ఎస్ రాజు మాట్లాడుతూ -చాలారోజుల తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రావణ లంక చిత్రం వస్తోందని గర్వంగా చెబుతున్నా. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీలో ఆడియన్స్ తల తిప్పడానికి అవకాశం లేని ఆసక్తికరమైన సన్నివేశాలు చూస్తారు. మురళీ శర్మ, దేవ్‌గిల్ సినిమాకు పెద్ద అస్సెట్. అలాగే స్క్రీన్‌మీద భద్రం, రచ్చ రవి కామెడీ టైమిం నవ్వులు పూయిస్తుంది. కొత్తవాడే అయినా హీరోగా క్రిష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అస్మిత, త్రిషల గ్లామర్ ఈ థ్రిల్లింగ్ మూవీకి అదనపు అట్రాక్షన్. సంగీత దర్శకుడు ఉజ్వల్ రూపొందించిన ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నాం. వేసవి వినోదంగా రానున్న చిత్రం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది అన్నారు.