6న చెబుతారట.. ఓ పిట్టకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవ్య క్రియేషన్స్‌పై దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కిస్తోన్న చిత్రం -ఓ పిట్ట కథ. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావ్, నిత్యశెట్టి హీరో హీరోయిన్లుగా వి ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా మార్చి 6న థియేటర్లకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే’ అంటూ సాగే మెలోడీ పాటను స్టార్ హీరోయిన్ పూజాహెగ్దె రిలీజ్ చేసింది. అయితే, ఈ పాట చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనను నిర్మాత ఆనంద్ ప్రసాద్ వెల్లడించారు.
-పాటను అమలాపురం, కాకినాడ పరిసరాల్లో చిత్రీకరించాం. సినిమాలో సన్నివేశం మూడ్‌కి తగ్గట్టుగా అక్కడ లోకేషన్స్‌లో విజువల్స్ తెరకెక్కించాం. తొలుత విజువల్స్ షూట్ చేశాక, హైదరాబాద్‌లో పాటకు ట్యూన్ కట్టడం జరిగింది. ఇలా ఇంతకుముందు దర్శకుడు వంశీ ‘లేడీస్ టైలర్’ చిత్రం కోసం ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే పాటలో ఈ తరహా ప్రయోగం చేశారు. విజువల్స్ తీసుకున్నాకే, ఇళయరాజాతో బాణీ కట్టించారు. ఆ తరహాలో సాగిన మా ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాం. మార్చి 6న సినిమా విడుదలవుతోంది అన్నారు. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ‘ఒక గ్రామంలో జరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రేకెత్తిస్తుంది. క్లైమాక్స్ వరకూ అదే పట్టుతో కథ సాగుతుంది స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ట్విస్ట్‌లు ఆడియన్స్‌ని థ్రిల్ నిస్తాయనే అనుకుంటున్నా అన్నారు.