నక్సలైట్‌గా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’లో డౌన్ టు ఎర్త్ పాత్రతో -తన పెర్ఫార్మెన్స్ పరిధిని విస్తరించాడు రామ్‌చరణ్. కెరీర్‌లో ఎన్ని హీరో పాత్రలేసినా -వేళ్లపై లెక్కపెట్టుకోదగ్గ ప్రాణప్రద పాత్రల జాబితాలో ‘చిట్టిబాబు’ ఎప్పటికీ ఉంటాడు. ఇప్పుడు దర్శకుడు కొరటాల చిత్రంలో అలాంటి వైవిధ్యమున్న పాత్రను రామ్‌చరణ్ పోషిస్తున్నాడట. కొరటాల తెరకెక్కిస్తోన్న చిరంజీవి 152వ ప్రాజెక్టులో -రామ్‌చరణ్ నక్సలైట్‌గా కనిపించనున్నాడన్న కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. కథలో చరణ్‌ని హీరోగా చూపించే అవకాశం లేదు కనుక -ప్రత్యేక అతిథి పాత్రగా తీర్చిదిద్దినా.. కనీసం 30 నిమిషాల నిడివి చరణ్ పాత్ర ఉంటుందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. జక్కన్న తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుతో ప్రస్తుతం చరణ్ బిజీగానే ఉన్నాడు. అయినప్పటికీ -కొరటాల టీం రాజమండ్రిలో నిర్వహించనున్న షెడ్యూల్‌తో చరణ్ ఈ ప్రాజెక్టులోకీ చేరతాడన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా క్యాటగిరీ సినిమాగా రాజవౌళి ట్రిపుల్ ఆర్‌ను చెక్కుతున్నాడు. అందులో రామరాజు పాత్ర పోషిస్తోన్న చరణ్ -పెద్దగా మేకోవర్ అవసరం లేకుండానే అదే కోర మీసకట్టుతో కొరటాల ప్రాజెక్టులో నక్సలైట్‌గా కనిపించే అవకాశాలు లేకపోలేదు. యంగ్ చిరంజీవి పాత్రలో నక్సలైట్‌గా చరణ్ కనిపిస్తాడని, ఫ్యాష్‌బ్యాక్‌లా సాగే ఎపిసోడ్‌లో చరణ్‌కు ఓ లవ్ స్టోరీ కూడా ఉంటుందని, ఆ హీరోయిన్‌ని సైతం ఇప్పటికే ఫైనలైజ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అయితే, చిత్రబృందం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ప్రస్తుతానికి ప్రాజెక్టు టైటిల్ ‘ఆచార్య’ అనే వినిపిస్తోంది. చిరంజీవితో త్రిష జోడీ కడుతున్న ఈ సోషల్ డ్రామాను రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.