ఎస్.. ఎన్ -సిల్లీ ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే స్క్రీన్‌పై కనిపించటం ఒక ఆనందమైతే -వాళ్లిద్దరి మధ్య ‘లవ్’ ఫైట్ మరింత వినోదమే. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు.. ఆ తరువాతి కాలంలో చిరంజీవి.. ఇలా కథానాయకుడి కోసం -ఇద్దరు హీరోయిన్లు తగవులాడుకునే సినిమాలెన్నో వచ్చేవి. ఈకాలంలో అలాంటి వినోదాన్ని రంగరించిన సినిమాలో -సమంత, నయనతార కనిపించనున్నారు. వాళ్లిద్దరూ తగవులాడుకునే సన్నివేశాలను దర్శకుడు విఘ్నేశ్ శివన్ చూపించనున్నాడట. విజయ్ సేతుపతి, సమంత, నయనతార కాంబోలో రానున్న తమిళ చిత్రం -కాతు వాకుల రెండు కాదల్. ఈ ప్రాజెక్టులో -కథానాయకుడి కోసం కథానాయికలు తన్నుకుచేచ్చ ఫన్నీ సీన్లను దర్శకుడు డిజైన్ చేశాడట. ఇద్దరి మధ్య నలిగిపోయే కథానాయకుడి పాత్రతో ఫన్ పండించటానికే -దర్శకుడు ఆ తరహా సన్నివేశాలను కథాంశంలోకి తీసుకున్నాడని అంటున్నారు. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. తెలుగులో సమంత, నయనతార క్రేజ్‌కుతోడు -సేతుపతికున్న స్టార్‌డమ్ నేపథ్యంలో.. తెలుగు ప్రేక్షకులకూ ‘హీరోయిన్ల తగవులు’ వినోదాన్ని పంచే అవకాశం లేకపోలేదు.