పైలెట్‌గా కంగన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హీరోల్లో.. ఏకబిగిన సినిమాలు చేస్తూ అక్షయ్ హిట్లు కొడుతుంటే -హీరోయిన్లలో గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలతో మెప్పిస్తోంది కంగనా రనౌత్. ఈమధ్యే పెళ్లయిన యువతిగా కబడ్డీ ఆడి -‘పంగా’తో మెప్పించిన కంగాన.. తాజాగా ‘తేజాస్’ని ప్రకటించింది. ప్రాజెక్టుని ప్రకటిస్తూనే ఫస్ట్‌లుక్ వదుల్తూ -ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్‌గా యూనిఫాంలోవున్న పోజుతో అదరగొడుతోంది. బ్యాక్‌డ్రాప్‌లో ఫైటర్ జెట్ చూస్తూంటే.. సినిమాలో కంగన సాహసకృత్యాలు కాస్త ఎక్కువగానే ఉంటాయన్న భావన కలుగుతోంది. ఇటీవలి కాలంలో ఐఎఫ్‌ఎస్‌లో యుద్ధ పైలెట్లు అవ్వడానికి ఎంతోమంది మహిళలు ఉత్సాహం చూపుతుండటం తెలిసిందే. ఆ నేపథ్యంగా -ఓ వీర వనిత సాహస గాథగా దర్శకుడు సర్వేష్ మేవారా సిద్ధం చేసిన కథలో -కంగన లీడ్‌రోల్‌లో కనిపించనుంది. వేసవి నుంచి షూటింగ్ ప్రారంభించి.. వచ్చే ఏడాదిలో వేసవికి సినిమాను ధియేటర్లకు తెచ్చే యోచనతో చిత్రబృందం కనిపిస్తోంది.