జాను.. జస్ట్ నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృకను మించి రీమేక్‌పై అంచనాలు పెరగడంతో -జాను ఫెయిల్యూర్ కాంబోపై ఇంపాక్ట్ చూపిస్తోంది. శర్వా, సమంత.. ఇద్దరూ మంచి పెర్ఫార్మెర్లే. కాకపోతే -జాను ఇంపాక్ట్.. మరో ప్రాజెక్టు కలిసి చేయడానికి సాహసం చేయలేనంత భయాన్ని క్రియేట్ చేసినట్టే కనిపిస్తోంది. ప్రాజెక్టు ఫెయిల్యూర్‌కి అసలు కారణాలు వేరున్నా -కాంబోపై మాత్రం బలమైన ఇంపాక్టే పడిందన్న వాతావరణం కనిపిస్తోంది. జాను విడుదలకు ముందు శర్వా గురించి ఎవ్వరూ చెప్పనంత, చెప్పలేనంతగా చెప్పిన సమంత -తాజాగా మరో ప్రాజెక్టును ఆ హీరోతో చేయడానికి ‘నో’ చెప్పడానికి కారణం అదే అయి వుంటుందని అంటున్నారు. ఆర్‌ఎక్స్ 100తో సెనే్సషనల్ హిట్టందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆ ఉత్సాహంతో అతను సిద్ధం చేసుకున్న ఇంటెన్స్ కంటెంట్ -మహాసముద్రం. స్క్రిప్ట్ విన్నవాళ్లంతా ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసేరే తప్ప, కదలడానికి సుముఖత చూపించలేదు. స్క్రిప్ట్‌పై గట్టి నమ్మకంతో వున్న అజయ్ భూపతి మాత్రం -పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్నాడు. -చివరకు మహాసముద్రంలో శర్వా, సమంతను చూపించడానికి ఉపక్రమించాడు. సామ్ ముందే ఒకే చేప్పినా -శర్వా మాత్రం క్లియరెన్స్ ఇచ్చాడా? లేదా అన్నది తెలీదు. అయితే, కొంతకాలంగా అజయ్ ఇద్దరితోనూ స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తున్నాడన్నది ఇండస్ట్రీ మాట. ఈలోగా వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన జాను -ఓ విఫల రీమేక్‌గా నిలిచిన నేపథ్యంలో.. శర్వాతో మరో ప్రాజెక్టు చేయడానికి సామ్ నో చెప్పేసిందన్న టాక్ వినిపిస్తోంది. అసలు అజయ్ ప్రాజెక్టుకు శర్వా ఓకే చెప్పాడా? చెబితే -సామ్ ప్లేస్‌లోకి ఎవరిని తీసుకోవచ్చు? అసలు వినిపిస్తున్న కథనాలన్నీ నిజమేనా? అన్నది ‘మహాసముద్రం’ మేకర్‌నుంచి ప్రకటన వస్తేగానీ నమ్మడానికుండదు.