ప్లాటినమ్‌లో హైదరాబాద్ లవ్‌స్టోరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ రవీంద్రన్, రేష్మిమీనన్, జియా ప్రధాన పాత్రల్లో రాజ్‌సత్య దర్శకత్వంలో ఎస్.ఎన్.ఆర్. ఫిలింస్ పతాకంపై ఎస్.ఎన్.రెడ్డి నిర్మించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన రావడంతో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. నిర్మాత సి.కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని యూనిట్ సభ్యులకు డిస్క్‌లను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిర్మాత రియల్ ఎస్టేట్‌నుండి పరిశ్రమలోకి వచ్చిన వ్యక్తని, సినిమాలపై మంచి ఆసక్తి వుందని, ఈ సినిమాతో రాహుల్‌కి మంచి బ్రేక్ రావాలని, ట్రైలర్స్ బావున్నాయని అన్నారు. హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, మంచి టీమ్‌తో పనిచేస్తున్నందుకు ఆనందంగా వుందని, నిర్మాత రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని, సునీల్ కాశ్యప్ మంచి మ్యూజిక్ అందించాడని, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకముందని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, చాలా ఆనందంగా వుందని, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ, మనీష్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.