త్రివిక్రమ్ నా మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ముందుంటే -దారి. నా పక్కనుంటే -అండ. నా వెనుకుంటే -్ధర్యం. సింపుల్‌గా చెప్పాలంటే నా మార్గదర్శక అదృష్టం అన్నాడు హీరో నితిన్. రష్మిక జోడీగా నితిన్‌తో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం -్భష్మ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ తెరకెక్కించిన చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో హీరో నితిన్ మాట్లాడుతూ -ఏడాదిన్నర గ్యాప్‌నకు కారణం స్క్రిప్ట్ పక్కాగా పూర్తయ్యేవరకూ ప్రాజెక్టు మొదలు పెట్టకపోవడమే. నేను చేసిన ‘దిల్’కు, నాకు పెద్ద అభిమానినని చెప్పే వెంకీ చేసిన సినిమా కనుక -ఇదొక ఫ్యాన్ బోయ్ సినిమాలానే ఉంటుంది. దిల్, సై తరువాత మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించే సినిమా భీష్మ. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్స్‌తో ఫ్యాన్స్ ఆకలి తీరుతుందనే అనుకుంటున్నా. సెకెండాఫ్‌లో వచ్చే ఫైట్స్‌తో ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఇక వాట్టే బ్యూటీ పాటతో రష్మిక టాలెంట్ తెలుస్తుంది. ఆమె హార్డ్ వర్క్, డెడికేషన్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆకాంక్షిస్తున్నా. నా నిర్మాతలు చినబాబు, వంశీలతో మొదట ‘అఆ’ చేసి, ఇప్పుడీ సినిమా చేశా. మూడో సినిమా ‘రంగ్ దే’ ఇప్పటికే చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ అప్పుడే స్కెచ్ గీస్తున్నారు. నా లైఫ్‌లో పంచ ప్రాణాలు అమ్మా, నాన్న, అక్క, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అయితే, ఆరో ప్రాణంగా భార్య వస్తోంది. మళ్లీ చెప్తున్నా నా లైఫ్‌లో త్రివిక్రమ్ ఉండటం నా అదృష్టం అన్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ -నితిన్‌కు వాళ్లన్న పవన్ కల్యాణ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయ్. ఆయన తరఫున, అభిమానుల తరఫున్ నితిన్‌కు ఆల్ ది బెస్ట్. నేను సినిమా చూశాను. బాగుంది. 21న ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా. రష్మికకు మరిన్ని విజయాలు రావాలి. జెర్సీ తరువాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాని మీ ముందుకు తెస్తున్నారు. మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. హీరోయిన్ రష్మిక మండన్న మాట్లాడతూ -మోడ్రన్ జనరేషన్‌లో రియల్ ఫ్రెండ్స్ దొరకడం కష్టమైపోతుంది. బట్, ఈ ప్రాజెక్టులో నాకు వెంకీ కుడుముల దొరికాడు. ఆర్గానిక్ అగ్రికల్చర్ నేపథ్యంగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని, దాన్ని తెరకెక్కిస్తున్న విధానం చూసి సరెండరైపోయా. పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నట్టే సినిమా ఆడియన్స్‌ని బలంగా కనెక్టవుతుంది. నితిన్ ఓ బెస్ట్ కో స్టార్, లైఫ్‌లాంగ్ నిలబడే బెస్ట్ ఫ్రెండ్. సినిమా కోసం నేనూ ఎదురు చూస్తున్నా అన్నారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ -త్రివిక్రమ్‌కు నేను భక్తుడ్ని. ‘అఆ’ సినిమా టైంలో ఆయన దగ్గర నన్ను పెట్టింది నిర్మాత చినబాబే. ఇద్దరికీ ఎప్పటికీ రుణపడివుంటా. సినిమా కథకు ఎక్కువ సమయం తీసుకోవాల్సి రావడం వల్లే, నితిన్ ఫ్యాన్స్‌ని వెయిట్ చేయించాల్సి వచ్చింది. సినిమాపై నమ్మకంతో ఉన్నా. టెక్నీషియన్స్ పనితనం అద్భుతం. ఆడియన్స్‌ని డిజప్పాయింట్ కానివ్వనని హామీ ఇస్తున్నా అన్నారు. కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు మహతి, నటుడు బ్రహ్మాజీ, గీత రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యామ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఫైట్‌మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.