దిశ మాయమైంది ఎలా అంటే..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలయం చిత్రంలో దిశ పాత్రలో కనిపిస్తా. సంప్రదాయ యువతిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దశ, అనూహ్యంగా మాయమవుతుంది. అసలు దిశకు ఏమైంది? ఎలా మాయమైంది? అన్న సస్పెన్స్‌ను రివీల్ చేసే చిత్రమే వలయం అంటోంది -హీరోయిన్ దిగంగన సూర్యవంశీ. ఆమె మాయమవ్వడానికి అక్రమ సంబంధాలే కారణమా? అన్న సందిగ్ధంతో కూడిన సస్పెన్స్‌తో కథ నడుస్తుందంటోంది. లక్ష్, దిగంగన సూర్యవంశీ జోడీగా రమేష్ కుదుముల దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ -వలయం. 21న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హీరోయిన్ దిగంగన మీడియాతో మాట్లాడింది. తానెంతగానో ప్రేమించే భార్య కనిపించకుండా పోవడంతో -సమస్యల్లో పడతాడు హీరో. చుట్టూవున్న ప్రపంచం భార్యగురించి తప్పుగా మాట్లాడుతుంటే -ఏమైందో అర్థంకాక కన్ఫ్యూజన్‌లో ఉంటాడు. అందుకే వలయం అన్న టైటిల్ పెట్టారంటోంది. కొద్దిరోజుల క్రితం వచ్చిన హిప్పీ చిత్రం సక్సెస్ కాకున్నా, ఆడియన్స్ తనను యాక్సెప్ట్ చేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గోపీచంద్ ‘సీటీమార్’ ప్రాజెక్టులో ఓ లీడ్ రోల్ చేస్తున్నానని, రచనా విధానంపై ఆసక్తివున్న తాను రెండు సినిమా స్క్రిప్ట్‌లు కూడా సిద్ధం చేశానని చెబుతోంది దిగంగన.