అలాపడింది పోస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో చిరకాలంగా ఆడియన్స్‌కి వినోదాన్ని అందిస్తోన్న థియేటర్ -సంధ్య. ఆ థియేటర్‌లో పదేళ్లకాలం పాటు ప్రొజెక్టర్‌గా పని చేసి ఇప్పుడు దర్శకుడయ్యాడు మహిపాల్‌రెడ్డి టి. సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై టిఎంఆర్ తెరకెక్కించిన చిత్రం -పోస్టర్. విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్లు. ‘పోస్టర్’కు సంబంధించిన టీజర్‌ను నిర్మాత సురేష్‌బాబు విడుదల చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ -టీజర్ చూశాక మహిపాల్‌రెడ్డి ప్రతిభ అర్థమైంది. తొలి చిత్రానే్న అనుభవమున్న దర్శకుడిలా తీసిన విధానం అభినందనీయం. థియేటర్ నేపథ్యంగా తీసిన సినిమా -ఆడియన్స్‌ని థియేటర్‌కు లాక్కురావడం ఖాయం. చిత్రబృందం స్పిరిట్ చూస్తుంటే -మంచి విజయాన్ని అందుకుంటారన్న నమ్మకం కలుగుతోందన్నారు. దర్శకుడు మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ -ప్రతి ఇంట్లో జరిగే కథనే నేను సినిమా చేశా. పోస్టర్ అంటించడానికి కూడా పనికిరాని ఒక వ్యక్తి -పోస్టర్ మీదికెక్కే స్థాయికి ఎలా ఎదిగాడన్నది సినిమా కథ. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడమే జీవితం. అంతేకానీ, చిన్న విషయాలకే కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దనే అంతర్లీన సందేశం ఆడియన్స్‌కి నచ్చుతుందనే అనుకుంటున్నా అన్నారు. హీరో విజయ్ మాట్లాడుతూ -పెద్ద నిర్మాత సురేష్‌బాబు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం మా అదృష్టం. ఒక వ్యక్తి జీరో నుంచి హీరో ఎలా అయ్యాడన్నదే అసలు కథ. ఇన్‌స్పిరేషనల్ మూవీగా ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందనే అనుకుంటున్నా అన్నారు. శివాజీరాజా, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాథ్, స్వప్నిక, అరుణ్‌బాబు తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్ అందిస్తున్నారు.