స్ఫూర్తినిచ్చే నాట్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషి జీవితంలో లక్ష్యాలుండడం సహజమే. కొందరు అవి సాధించేందుకు శ్రమిస్తే, మరికొందరు ఆ కోరికలు చంపుకుని బ్రతుకుతుంటారు. జీవితమంటే మనకు నచ్చినట్లు జీవించడం, మన ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలనే కథతో తెరకెక్కించిన చిత్రం ‘నాట్యం’. సంధ్యారాజు, అలేఖ్య పుంజాల, వాసుదేవరావు, రేవంత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ లఘు చిత్ర ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ మాట్లాడుతూ, ఈ కానె్సప్టు నచ్చడంతో కీర్తిలాల్ డైమండ్స్ సపోర్టు చేయడానికి ముందుకొచ్చిందని, చాలాకాలంగా కీర్తిలాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌లు ఉన్నాయని, మహిళలను సపోర్టు చేయడానికి మేం ఎప్పుడూ ముందుంటామని, వారి లక్ష్యాలను ఎన్ని అడ్డంకులున్నా అధిగమించాలని చెప్పే సందేశం బాగుందని అన్నారు. రేవంత్ చక్కగా తెరకెక్కించారని, ఇందులో సంధ్య అద్భుతంగా నటించిందని అన్నారు. హీరోయిన్ సంధ్య మాట్లాడుతూ, డాన్సర్‌గా చాలా షోలు చేశానని, నటిగా ఇది తన తొలి చిత్రమని అన్నారు. ఈ రోజుల్లో చాలామంది ముఖ్యంగా మహిళలు తమ లక్ష్యాలను అనేక కారణాలతో వదిలేసి తృప్తిలేని జీవితాన్ని గడుపుతున్నారని, ప్రతి మనిషికి సమస్యలుంటాయని, వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే నిజమైన జీవితాన్ని గడిపినట్లని అన్నారు. దర్శకుడు రేవంత్ మాట్లాడుతూ, ఈ కథ అనుకున్న తరువాత ఈ పాత్రకోసం చాలామందిని వెతికానని, ముఖ్యంగా కూచిపూడి తెలిసినవారైతే బాగుంటుందని సంధ్యను కలిశానని, కథ బాగా నచ్చడంతో ఆమె చాలా కష్టపడి చేసిందని అన్నారు.

చిత్రం సంధ్యరాజ్