ఎన్టీఆర్‌గా శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించిన పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ వెబ్ సిరీస్ -చదరంగం. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలోని చిన్న ఎపిసోడ్‌ని తీసుకుని ఇప్పటి కాలమాన పరిస్థితులకు లింక్ చేస్తూ చేసిన వెబ్ చిత్రమిది. ఎన్టీఆర్‌గా శ్రీకాంత్ కనిపించనున్న చిత్రంలో సునైన్, నాగినీడు, కౌసల్య తదితరులు నటించారు. రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ -ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్ జీ5లో ప్రదర్శిస్తున్నట్టు మంచు విష్ణు వెల్లడించాడు.
వెబ్ సిరీస్‌పై విష్ణు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ -ఈ కథ నా దగ్గరికి వచ్చినపుడు నా తండ్రి మోహన్‌బాబును సలహా అడిగాను. ప్రజలకు వాస్తవాలు చూపించూ అంటూ ధైర్యాన్నిచ్చారు. తరువాత స్క్రిప్ట్‌ని మరింత మెరుగుపర్చేందుకు పరుచూరి గోపాలకృష్ణ సలహాలు తీసుకున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ -భవిష్యత్‌లో డిజిటల్ ఫ్లాట్‌ఫాం వాల్యూ పెరుగుతుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోని చాలామంది దీనిపై దృష్టిపెట్టారు. హీరో శ్రీకాంత్‌కి ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇందులో నేనొక పాత్ర చేశా. అదే నా ఒరిజినల్ క్యారెక్టర్. ఈ చదరంగం పెద్ద హిట్టవ్వాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు రాజ్ మాట్లాడుతూ -కథ వినగానే విష్ణు ఓకే అన్నారు. పాత్ర చేయడానికి శ్రీకాంత్ ముందు కాస్త తటపటాయించినా, విష్ణు మాటతో ఒప్పుకున్నారు. సక్సెస్‌పై పెద్ద నమ్మకంతో ఉన్నా అన్నారు.