నేను సింగిల్ అని ఎవరన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో వరుస సినిమాలతో జోరుమీదుంది సమంత. మరోవైపు తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సమంత నటించిన ‘24’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. సూర్య త్రిపాత్రాభినయంలో విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కి అందరిచేత అభినందనలు అందుకుంటోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంత పాత్రికేయులతో ముచ్చటించింది.
---
సమ్మర్ హవా మీదేలా వుంది?
- సమ్మర్‌లో వరుసగా నా సినిమాలు విడుదలవుతుండడం ఆనందంగా వుంది. అయితే, ఇదేదీ నేను ప్లాన్ చేసింది కాదు. నా లక్ అని చెప్పాలి. చేసిన నాలుగు సినిమాలు విభిన్నమైనవే. విజయ్‌తో నటించిన తేరి (పోలీసోడు) సూపర్‌హిట్ అయింది. ఆ తరువాత చేసిన ‘24’ సినిమా క్లాస్ మూవీగా మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే, ‘బ్రహ్మోత్సవం’, ‘అ..ఆ’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.
‘24’ చిత్రం గురించి?
- ఇలాంటి విభిన్నమైన కానె్సప్టు హాలీవుడ్‌లో చూసి వుంటాం కానీ, ఇండియాలో మాత్రం కొత్తది. నిజంగా విక్రం కుమార్ టాలెంట్‌ను అభినందించకుండా వుండలేం. ఇది సూర్య-విక్రంల సినిమా.
కథ విన్నప్పుడు ఎలా ఒప్పుకున్నారు?
- కథ కొత్తగా అన్పించింది కానీ ఎక్కడో చిన్న అనుమానం వుండేది. ఇంతకుముందు నేను చేసిన ‘ఈగ’ సినిమా సమయంలో కూడా ఈ కథ జనాలకు ఎక్కుతుందా అనే చిన్న అనుమానం వుండేది. కాని దాన్ని బీట్ చేసి ‘ఈగ’ చిత్రం సంచలన విజయం సాధించింది. అలాంటి నమ్మకమే ఈ సినిమాపై పెట్టుకున్నాను. అది కూడా హిట్ అవడం ఆనందంగా వుంది.
సూర్యతో పనిచేయడం?
- సూర్యతో నేను ఇదివరకే ఓ సినిమా చేశాను. తను సినిమాకోసం ఎంతైనా రిస్క్ చేసే మనిషి. ముఖ్యంగా భిన్నమైన కథలతో సినిమాలు చేయడం ఆయనకు ఇష్టం. ఇలాంటి సినిమాను ఆయన తప్ప ఎవరూ చేయలేరు. తనతో పనిచేయడం చాలా ఆనందంగా వుంటుంది. మంచి వ్యక్తి. ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో అద్భుతంగా చేశాడు. ఈ ఏడాది అవార్డులన్నీ ఆయనకే వస్తాయి.
రొమాన్స్ ఫోబియా గురించి?
- ఈ సినిమాలో లవ్ పోర్షన్స్ చాలా క్యూట్‌గా వుంటాయి. విక్రం వాటిని బాగా డీల్ చేస్తాడు. నిజానికి ‘24’ అనేది ఇంటెన్షన్ వున్న సినిమా. అలాంటి ఇలాంటి క్యూట్ లవ్ సీన్స్‌తో రొమాంటిక్ పోర్షన్‌ను ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
జయాపజయాలపై మీ ఫీలింగ్?
- తప్పకుండా రిజల్ట్ గురించి పట్టించుకుంటాను. కానీ, దాన్ని సీరియస్‌గా తీసుకోను. మనం చేస్తున్న పని కరెక్టుగా ఉండేలా చూసుకుంటాను. ఎనిమిది నెలలుగా రోజూ షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నాను. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చేశా. దాంతోపాటు చేసిన నాలుగు సినిమాల్లో కూడా నా పాత్రలు భిన్నంగా వున్నాయి.
సింగిల్‌గా ఇంకెన్ని రోజులు?
- ఎవరన్నారు నేను సింగిల్ అని? ఇప్పుడు దాని గురించి అవసరం లేదు.
‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మీ పాత్ర?
- ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నా పాత్ర కొత్తగా వుంటుంది. ముఖ్యంగా శ్రీకాంత్ కొన్ని సన్నివేశాలను చాలా బాగా రాశారు. కొత్తగా వుండే సినిమా ఇది. ఇప్పటివరకు నేను సెంటిమెంట్, లవ్, రొమాన్స్ లాంటి పాత్రలు చేశాను కానీ, మొదటిసారి ఇందులో కామెడీ పండించాను.
‘అ..ఆ’ లేడీ ఓరియెంటెడ్ సినిమానా?
- ఎవరన్నారు? కాదు, అయితే ఇందులో హీరో హీరోయిన్‌కు సమాన పాత్రలు వుండడంతో అలా అన్పిస్తుందేమో. ముఖ్యంగా త్రివిక్రమ్‌కు థాంక్స్ చెప్పాలి. మంచి సినిమా ఇచ్చాడు. ఇందులో నా పాత్ర చాలా బాగుంటుంది.
సీనియర్ హీరోల సినిమాల్లో చేస్తారా?
- చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ప్రారంభమయ్యాయని తెలిసింది. ఇప్పటివరకు ననె్నవరూ అడగలేదు. చూద్దాం!
తదుపరి ప్రాజెక్ట్స్?
- విభిన్నమైన పాత్రలు చేయాలనుంది. ఇప్పటికే తమిళంలో డార్క్ రోల్స్ చేశాను. తెలుగులో అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా. కన్నడలో హిట్ అయిన ‘యూ టర్న్’ సినిమా తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అందులో నటిస్తున్నాను.

--
హీరోయన్లు ఎందరున్నా
నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలి

నేను నటించే సినిమాలో ఖచ్చితంగా కథ బాగుండాలి. దానికితోడు మా పాత్రకు ఎంత ప్రాముఖ్యత వుందనేది చూసుకుంటాను. నాతోపాటు మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు నటించినా పట్టించుకోను. నా పాత్రకు ప్రాముఖ్యత వుంటే తప్పక ఆ సినిమాలో నటిస్తా.

-శ్రీ