డబ్బింగ్‌లో ఎర్రచీర..నల్లచీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులో నిర్మాత బావాజీ అనువదిస్తున్నారు. ‘ఐ లవ్ యూ’ పేరుతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎర్రచీర - నల్లచీర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత బావాజీ మాట్లాడుతూ, ఇద్దరమ్మాయిల మధ్య జరిగిన యధార్థ ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడంలో విజయవంతమైందని, తెలుగులో కూడా అందరికీ నచ్చుతుందని అనువదిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రం అనేక సమస్యలను ఎదుర్కొందని, సెన్సార్‌లో కూడా అనేక సవాళ్లను దాటుకొని అక్కడ విడుదలైందని తెలిపారు.
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హైలెట్‌గా వుంటుందని అన్నారు.
ఈ చిత్రానికి నిర్మాత, దర్శకత్వం:బావాజీ.