శంషాబాద్‌లో చుట్టాలబ్బాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది కథానాయకుడిగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమాకు సంబంధించిన ముగింపు సన్నివేశాల చిత్రీకరణ శంషాబాద్ దేవాలయంలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, బ్యాంకాక్‌లో తీసిన హీరో పరిచయం పాట, రాజమండ్రిలో చిత్రీకరించిన పాటలు బాగా వచ్చాయని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ముగింపు సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, ‘పూలరంగుడు’ క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఇక్కడే తీశామని తెలిపారు. అందరినీ ఆకట్టుకునే ఫ్యామిలీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకు మంచి బాణీలు కుదిరాయని, ఆదికి సూపర్‌హిట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు. నమితాప్రమోద్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, రవిబాబు, కృష్ణ్భగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, గిరిధర్, అనితానాగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్.అరుణకుమార్, సంగీతం:తమన్, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, మాటలు:్భవాని ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వీరభద్రమ్.

చిత్రం నమితాప్రమోద్, ఆది