ఆటాడుకుందాం రా.. టాకీ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలింస్ పతాకంపై అన్నపూర్ట స్టూడియోస్ సమర్పణలో సుశాంత్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’ టాకీపార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల నిర్మించారు. టాకీపార్ట్ పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా చిత్రాలు రూపొందించడం వీలుకాని తాను, సీరియస్ సినిమాలు ఇప్పటివరకు చేయలేదని, సుశాంత్‌కు చెప్పిన స్టోరీ నచ్చడంతో సినిమా మొదలుపెట్టామని, ఎమోషనల్ కామెడీతో ఇద్దరు స్నేహితులు విడిపోయి ఎలిమెంట్‌తో ఈ చిత్రం రూపొందిందని అన్నారు.
50 రోజులు టాకీపార్ట్ పూర్తిచేసి మరో 20 రోజులు పాటల షూటింగ్ చేయనున్నామని, సుశాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను మంచి ఖరీదైన లొకేషన్స్‌లో చేస్తామని, తప్పక ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఇప్పటివరకు తాను ఇలాంటి జోనర్‌లో నటించలేదని, ప్రేక్షకులకు పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో నన్ను కొత్తగా చూపించారని కథనాయకుడు సుశాంత్ తెలిపారు. నిర్మాతలు నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే వుంటారని, శ్రీ్ధర్ సీపాన కథ అద్భుతంగా వుందని, టాకీ, యాక్షన్ పార్ట్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను జనవరిలోపు చిత్రీకరించి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీ్ధర్ సీపాన తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. సోనమ్ బజ్వా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెనె్నల కిశోర్, రఘుబాబు, పృధ్వీ, ఫిరోజ్ అబ్బాస్, సుధ, ఝాన్సీ, ఆనంద్, రమాప్రభ, రజిత తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:గౌతంరాజు, కధ, మాటలు:శ్రీ్ధర్ సీపాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.నాగేశ్వర్‌రెడ్డి.