బాగానే ఉన్నా... దుష్ప్రచారం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న వేణుమాధవ్, కొద్దికాలంగా సినిమాల్లో కనిపించడంలేదు. ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో అనేక వదంతులు వస్తున్నాయి. వేణుమాధవ్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, ఆయన పరిస్థితి విషమంగా తయారైందని వార్తలు ప్రచురించాయి. ఇక ఈ కథనాలు సోషల్ మీడియాలోనూ బాగా ప్రచారం పొందడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన వేణుమాధవ్, హైదరాబాద్‌లో పోలీసులకు ఓ ఫిర్యాదు అందజేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు కథనాలను ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇక పోలీసులను కలిసిన తర్వాత ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ వేణుమాధవ్ తన ఆవేదన వెలిబుచ్చారు. తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకుంటే క్యాన్సర్ అనీ, వేరే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని ప్రచారం రావడం చాలా బాధ కలిగించింది. దయచేసి ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురించవద్దని కోరారు.