మరల తెలుపనా ప్రియా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిన్స్, వ్యోమానంది జంటగా శ్రీ చైత్ర చలనచిత్ర పతాకంపై వాణీ ఎం.కొసరాజు దర్శకత్వంలో శ్రీనివాస్ ఊడిగ రూపొందిస్తున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకురాలు వాణి మాట్లాడుతూ- ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా, భిన్నమైన వ్యక్తిత్వాలు నేపథ్యాలు వున్న అమ్మాయి, అబ్బాయిమధ్య సాగే ప్రేమకథా చిత్రంగా రూపొందించామని, సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. హైదరాబాద్, గోవా, రుషికేశ్, హరిద్వార్, శివపురి, రాజమండ్రి, లక్కవరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేశామని, ఓ అందమైన ప్రేమకథకు అద్భుత దృశ్యకావ్యంగా దర్శకురాలు చిత్రీకరించారని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో పూజా రామచంద్రన్, సమీర్, రవివర్మ, ఫణి, సాయి, సన, కల్పలత, మృణాళిని, పావనిరెడ్డి, సౌమ్య, రమ్య, అను, రియా తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు:నివాస్, పాటలు:్భస్కరభట్ల, కృష్ణచైతన్య, శరణ్య, సంగీతం:శేఖర్ చంద్ర, కెమెరా:రాజశేఖర్.ఎస్., ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్.