ఫటా’ఫైటర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు పూరి -కొత్త ప్రాజెక్టు పనులు చకచకా చక్కబెడుతున్నాడు. మొదలుపెట్టిన ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంలో పూరికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం సెట్స్‌పైవున్న విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ను కూడా పూరి అంతే వేగంగా తీసుకెళ్తున్నాడు. ముంబయిలో ఫార్టీ డేస్ షూటింగ్ పూర్తి చేసిన పూరి -ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్టు చిత్రబృందం చెబుతోంది. ఈ ప్రాజెక్టులో విజయ్‌తో బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీపాండే కుమార్తె అనన్య పాండే రొమాన్స్ చేయనుండటం తెలిసిందే. ముంబయిలో పూర్తి చేసిన ఫార్టీ డేస్ షెడ్యూల్‌లో రెండు భారీ యాక్షన్ సీన్స్‌ని కూడా పూరి పూర్తి చేశాడట. విజయ్, రమ్యకృష్ణ, అనన్యపాండే, రోణిత్‌రాయ్, అలీ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలు తీసినట్టు చిత్రబృందం చెబుతోంది. పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతోన్న చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. అమెరికా ఒకప్పటి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. విలన్ పాత్రలో టైసన్ కనిపించనున్నాడని, అతనితో విజయ్ చేసే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందన్న కథనాలు ‘ఫైటర్’పై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. సో, సినిమా బడ్జెట్ విషయంలో -పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదట. ఇటీవలి కాలంలో విజయ్ సినిమాలు వరుసగా దెబ్బతినడంతో -పూరితో చేస్తున్న ‘ఫైటర్’పైనే రౌడీ బోయ్స్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. పూరి-విజయ్ క్రేజీ కాంబోలో వస్తోన్న ప్రాజెక్టుకు విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు. బాలీవుడ్‌కు విజయ్‌ను ఇంట్రొడ్యూస్ చేస్తున్న చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీకౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతాలు నిర్మిస్తుండటం తెలిసిందే.