ట్రైలర్‌లో 302
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిక దేశాయ్ లీడ్‌రోల్‌లో దర్శకుడు కార్తికేయ మిరియాల తెరకెక్కిస్తోన్న చిత్రం -302. డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మిస్తోన్న చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను నటుడు సునీల్ ఆవిష్కరించారు. సునీల్ మాట్లాడుతూ -మా కామెడీ కుటుంబం వెనె్నల కిషోర్, తా.రమేష్, వేణు తదితరులు చేసిన సినిమా ట్రైలర్ బావుంది. సినిమా ఆడియన్స్‌ని మెప్పించేదిగా ఉంది అన్నారు. నిర్మాత అవినాష్ మాట్లాడుతూ -13న ఈ సినిమా నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదలవుతోంది అన్నారు. దర్శకుడు కార్తికేయ మిరియాల మాట్లాడుతూ -క్రైం, సస్పెన్స్, కామెడీ అంశాలతోపాటు హారర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించాం. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లోంచి వచ్చేసిన 24 గంటల్లో ఏం జరిగిందన్న కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఫుల్‌టైమ్ కామెడీ సినిమాగా రూపొందిన చిత్రంలో ఇండర్నేషనల్ మోడల్ సూఫీ సయ్యద్ చేసిన ఐటెమ్ సాంగ్ హైలెట్‌గా ఉంటుంది అన్నారు.