చందమామ అందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ కాలం పుష్కరం దాటేయడంతో -సీనియర్ బ్యూటీ కాజల్‌కు తెలుగులో పెద్దగా సినిమాలు పడటం లేదు. పైగా రెమ్యునరేషన్ విషయంలోనూ చందమామ కిందకు దిగడానికి ఇష్టపడక పోతుండటంతో -హీరోయిన్‌గా కాజల్ గురించి ఆలోచించే దర్శక, నిర్మాతలూ కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో -సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించనున్న కొరియన్ రీమేక్‌లో చందమామకు చాన్స్ తగిలేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు కామెడీ హీరోగా చెలరేగిపోయిన నరేష్ -ఆ తరువాత వరుస ఫ్లాపులతో పూర్తిగా డీలాపడ్డాడు. గతేడాది మహర్షిలో హీరో ఫ్రెండ్ రోల్‌తో తనలోని ఎమోషనల్ పెర్ఫార్మర్‌ను చూపించిన నరేష్‌తో -సురేష్ బాబు ఓ కొరియన్ రీమేక్ ప్రాజెక్టు ప్లాన్ చేశారట. ‘డాన్సింగ్ క్వీన్’ రీమేక్ రైట్స్ సాధించిన సురేష్‌బాబు -నరేష్, కాజల్ జోడీగా ఆ ప్రాజెక్టును తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఈ పాత్ర కోసం కాజల్‌తో సంప్రదింపులు మొదలెట్టారన్న వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం కాజల్‌కు తెలుగులో సినిమాలే లేవు. కోలీవుడ్‌లో ఇండియన్ -2 వినా మరో కమిట్‌మెంట్ లేదు. సో, నరేష్‌తో జోడీకి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. పాత్ర కంటెంట్ నచ్చితే ఏ హీరోతోనైనా చేయడానికి ముందుకొస్తున్న కాజల్ -పారితోషికం విషయంలోనే కాంప్రమైజ్ అవుతుందా? అన్న సందేహాలు లేకపోలేదు. ప్రాజెక్టు బడ్జెట్ విషయంలో కాలిక్యులేటెడ్‌గా ఉండే సురేష్‌బాబు -రీమేక్‌పై భారీగా పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. చిన్న ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తే -కాజల్ ఓకే చెప్తుందా? అన్నదే తేలాల్సిన విషయం.