హిమాలయాల్లో చందమామ రావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువహీరో నవీన్ చంద్ర, ప్రియల్‌గోర్ జంటగా ఐఇఎఫ్ కార్పొరేషన్ పతాకంపై ధరమ్, రక్ష సంయుక్త దర్శకత్వంలో కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల రూపొందిస్తున్న చిత్రం ‘చందమామ రావే’ (అది రాదు.. వీడు మారడు..). ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేసి సినిమా పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- తొలిసారిగా ఇద్దరు దర్శకులతో ఈ చిత్రం రూపొందుతోందని, మూడు వైవిధ్యమైన కోణాల ప్రేమకథతో నేటి యువతకు నచ్చేలా వారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా రూపొందించామని తెలిపారు. హిల్‌స్టేషన్‌లో నాచురల్ అందంతో ఈ చిత్రాన్ని రూపొందించాలని హిమాలయాల్లో మైనస్ డిగ్రీ వాతావరణంలో మొదటి షెడ్యూల్ చేశామని అన్నారు. గోవాలో రెండో షెడ్యూల్, హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ పూర్తిచేశామని, ఈ పేరు ప్రేక్షకులకు నచ్చుతుందని వారన్నారు. ఈ సినిమా పేరులాగే హీరో పాత్ర వుంటుందని వివరించారు.