కల్యాణి చెప్పనున్న విలక్షణ ప్రేమకథ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటితరం హీరోయిన్లలో కల్యాణికి మంచి ఇమేజ్ ఉంది. చేసిన కొద్ది సినిమాల్లో మంచి హిట్లుండటంతో -తెలుగు ఆడియన్స్ దగ్గర మంచి స్థానమే సంపాదించుకుంది. ఇటీవలి కాలంలో అతిథి పాత్రల్లో కనిపిస్తోన్న కల్యాణి -తాజాగా దర్శక నిర్మాత అవతారమెత్తింది. కె2కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించే పనిలో నిమగ్నమైంది కల్యాణి. విలక్షణ ప్రేమకథను తనదైన స్టయిల్లో చెప్పేందుకు -తెలుగు, తమిళ భాషల్లో ఓ ప్రాజెక్టును రూపొందిస్తొంది కల్యాణి. హోలీ సందర్భంగా కల్యాణి తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించిన ప్రీలుక్, టీజర్ గ్లింప్స్‌ని దర్శకుడు పూరి ఆవిష్కరించారు. చేతన్ శీను, సిద్ధి, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శే్వత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. త్వరలోనే ప్రాజెక్టు రెగ్యులర్ షూట్ మొదలుపెడతామని చిత్రబృందం చెబుతోంది.