ఐటెమ్ కాదట..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఐటెమ్ సాంగ్స్ అంటే ఆడియన్స్‌కి రొటీన్ అయిపోయింది. సినిమాకు కమర్షియల్ టచ్ ఇవ్వాలంటే.. ఐటెమ్ పడేస్తే చాలనే ఆలోచన మేకర్స్ మైండ్‌లో బలపడటంతో -ఆమధ్య చాలా సినిమాల్లో ఐటెమ్స్ విస్తృతమయ్యాయి. భారీ రెమ్యునరేషన్‌తో హీరోయిన్లు సైతం ఐటెమ్స్‌కి రెడీ అవ్వడంతో -సెక్సీ స్టెప్స్, గ్లామర్‌ని చూడ్డానికి ఆడియన్సూ ఆసక్తి చూపించారు. చివరకు ఐటెమ్ సాంగ్ అంటే కాస్ట్లీగా తెరకెక్కించే ‘చీప్’ ట్రిక్ అన్న మాట బలపడిపోయింది. దీంతో ఐటెమ్ అనొద్దు -మేం చేస్తున్నది ‘స్పెషల్ సాంగ్స్’ అంటూ సెలవిచ్చాడు కొందరు హీరోయిన్లు. రెండడుగులు ముందుకేసిన రెజీనా -స్పెషల్ కాదు.. సెలబ్రేషన్ సాంగ్ అంటూ కొత్త పదాన్ని వాడుకలోకి తెస్తోంది తెలివిగా. చిరంజీవి 152వ ప్రాజెక్టు ఆచార్య సెట్స్ మీదున్న విషయం తెలిసిందే. అన్యాక్రాంతమైన దేవాలయ భూముల నేపథ్యంగా దర్శకుడు కొరటాల శివ తెరెకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్టులో రెజీనా -కమర్షియల్ సాంగ్‌తో అలరించబోతోంది. దీనిపై రెజీనా స్పందిస్తూ -డ్యాన్స్ అంటే నాకు పిచ్చి. తన డ్యాన్స్‌తో ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేసిన చిరంజీవితో మూమెంట్స్ చూపించే చాన్స్ వస్తే వదలుకుంటామా? అందుకే సెకెండ్ థాట్ లేకుండా ఓకే చెప్పేశాను. ఇప్పటికే షూట్ పూరె్తైంది. చిరు డ్యాన్స్ నాలో స్ఫూర్తిని నింపితే, నా డ్యాన్స్‌ను ఆయన మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. అయితే, ఆచార్యలో నేను చేసింది ఐటెమ్ సాంగ్ కాదు, సెలబ్రేషన్ సాంగ్. చిరు కోసమే ఈ పాట చేశా. ఇకపై ఇలాంటి పాటలు చేయను అంటోంది రెజీనా. ఐటెమ్ సాంగ్‌కి అందమైన పేరు పెట్టి.. అలాంటి పాటలకు ఫుల్‌స్టాప్ పెట్టానంటోది రెజీనా.